వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ లో మారుమోగుతోన్న 'భారత్ మాతా కీ జై నినాదం..'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ సైనిక చర్యకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పాక్ తీరును ఎండగట్టేందుకు సైన్యం చేస్తోన్న ఆపరేషన్స్ కు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించారు. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం పాక్ పై చేపట్టిన చర్యల్లో ఇదే పెద్ద ఆపరేషన్ గా చెప్పుకుంటున్న నేపథ్యంలో సైన్యానికి మద్దతు ప్రకటిస్తూ పలువురు నేతలు, సినీ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ పై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. 'భారత్ మాతా కీ జై ..' భారతీయులంతా సైన్యం వెంటే ఉంటారు.. అంటారు ట్వీట్ చేశారు. ఇదే విషయంపై స్పందిస్తూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.. భారత సైన్యం చేపట్టిన చర్య దేశానికి గర్వ కారణంగా ఉందన్నారు. దౌత్య వేదికల ద్వారా పాక్ తన వైఖరిని మార్చుకోవాలని ఎన్నిసార్లు విజ్నప్తి చేసినా పాక్ లో మార్పు రాలేదని అభిప్రాయపడ్డారాయన.

This Is How Twitterati Reacted To Surgical Strike By India

ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా సర్జికల్ స్ట్రైక్ పై స్పందించారు. 'భారత్ మాతా కీ జై' అంటూ సైన్యానికి తన మద్దతు ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. పాకిస్తాన్ తీవ్రవాదిలా వ్యవహరిస్తున్నందునా, పాక్ కు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరముందన్నారు.

ఉగ్రవాదులందరికీ భారత సైన్యం చేపట్టిన చర్య ఓ గుణపాఠం అవుతుందని, సర్జికల్ స్ట్రైక్ భారత సైన్యంలో నైతిక స్థైర్యాన్ని పెంచుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సర్జికల్ స్ట్రైక్ ను సమర్థిస్తూ ప్రధాని మోడీ దేశం గర్వపడేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశంసించారు.

English summary
Minutes after DGMO Lt Gen Ranbir Singh announced that Indian Army conducted surgical strikes on terror launch pads across the Line of Control in the wake of Uri terror attacks, social media site Twitter got flooded with reactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X