వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్దరాత్రి సుప్రీంలో విచారణ కొత్త కాదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమెన్ తన క్రిమినల్ మైండ్ ఉపయోగించి చివరి క్షణాలలో సుప్రీం కోర్టులో హై డ్రామాకు తెరలేపడం వెలుగు చూసింది. గతంలో రెండు కేసులలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తన కేసులో వస్తుందని ప్లాన్ వేశాడు. అయితే అది రివర్స్ అయ్యింది.

గతంలో రెండు ఉరి శిక్షల కేసులలో సుప్రీం కోర్టు అర్దరాత్రి విచారణ చేసి ఉరి శిక్షలను రద్దు చేస్తు తీర్పు చెప్పింది. మంగల్ లాల్ బరోల, సుదీందర్ కోలి అనే ఇద్దరు ఉదయం ఉరి శిక్ష పడుతుందనే సందర్బంలో అర్దరాత్రి ఆ శిక్ష నుండి తప్పించుకున్నారు.

5 గంటల ముందు బచావ్!

this is however not the first time something to this effect has taken place

తన పిల్లలను తానే అతి దారుణంగా హత్య చేశాడనే కేసులో మంగల్ లాల్ బరోలా అనే వ్యక్తికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. 2013 ఏప్రిల్ 9వ తేదిన అతనికి ఉరి శిక్ష అమలు చెయ్యడానికి సర్వం సిద్దం చేశారు. రాష్ట్రపతి అతని క్షమాభిక్ష అర్జీని తిరస్కరించారు.

అయితే ఉరి శిక్షకు ముందు రోజు రాత్రి 11 గంటల సమయంలో అతని న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తుల ఇంటిలోనే విచారణ జరిగింది. బరోలాకు ఉరి వెయ్యడానికి జైలులో సర్వం సిద్దం చేశారు. అయితే ఉరి శిక్ష అమలు అయ్యే ఐదు గంటల ముందు అతని ఉరి శిక్షను రద్దు చేస్తు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సీరియల్ కిల్లర్!

అనేక మంది చిన్నారులను అతి దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ సురీందర్ కోలికి 2014 సెప్టెంబర్ 9వ తేదిన ఉరి శిక్ష విదించాలని కోర్టు తీర్పు చెప్పింది. అయితే అంతకు ముందు రోజు రాత్రి సురీందర్ న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

హై కోర్టు న్యాయమూర్తులు హెచ్.ఎల్. దత్తు, ఎ.ఆర్ దావే సుప్రీం కోర్టు హాల్ లోనే అర్జీ విచారణ చేశారు. కోలి ఉరి శిక్షపై స్టే విదిస్తు ఆదేశాలు జారీ చేశారు. సురీందర్ కోలి చేతిలో హత్యకు గురైన 17 మంది చిన్నారుల అస్తిపంజరాలను అతని ఇంటిలోనే పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

ముచ్చటగా మూడోసారి యాకూబ్.. కుదరలేదు!

ఈ ఇద్దరు నిందితుల న్యాయవాదులు అర్దరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లే యాకూబ్ మెమెన్ న్యాయవాదులు అర్దరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అర్దరాత్రి 12.45 గంటల సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు అర్జీ విచారణకు అంగీకరించారు. అయితే అర్జీ విచారణ చేసిన త్రిసభ్య బెంచ్ యాకూబ్ ఉరి శిక్ష రద్దు చెయ్యడానికి నిరాకరిస్తు అర్జీ కొట్టివేశారు. యాకూబ్ కు ఉరి శిక్ష అమలు చేశారు.

English summary
While there is a lot that is being spoken about the pre-dawn hearing by the Supreme Court in the Yakub Memon case, this is however not the first time something to this effect has taken place. In the past there have been two such instances when the Supreme Court has opened its doors for death row convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X