వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిస్సా కుర్సీకా అంటే ఇదే..! కుర్చీ ఖాళీ లేనప్పుడు సీయంను కాలేనన్న సిద్దరామయ్య..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్ : కిస్సా కుర్సీ కా అంటే ఇదే.. ఎప్పుడూ సంచలనాలు చేస్తూ వార్తల్లో నిలిచే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య మరోసారి కర్ణాటక సీయం కుర్చీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని కాసేపు నవ్వించారు. సీఎం కుర్చీనే ఖాళీ లేకుంటే, నేనెలా ముఖ్యమంత్రి అవుతానన్నారు..? మాజీ ముఖ్యమంత్రి సిద్దా రామయ్య. బుధవారం హుబ్బళ్ళి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు. కొందరు అభిమానంతో అలా అంటుంటారని ఎమ్మెల్యేలు నా పట్ల ప్రత్యేకత చూపుతున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతితో కూరుకుపోయారని అందుకే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారని వారి పరిపాలనకు అదే అద్దం పట్టినట్టు అని వ్యాఖ్యానించారు.

this-is-kissa-kursika-sidda-ramaiah-is-not-able-to-get-the-cm-chair

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగానని, అవినీతికి తావు లేకుండా పాలన సాగించానన్నారు సిద్దా రామయ్య. జేడీఎస్‌ సీనియర్‌ నేత బసవరాజ్‌ హొరట్టి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి స్థానం నుంచి రమేశ్‌ జార్కిహొళిని తొలగించడంతోనే వివాదం కొనసాగుతోందనడం సరికాదన్నారు. హొరట్టి మౌనంగా ఉంటే బాగుంటుందన్నారు. దేశంలో కెల్ల కర్ణాటక రాజకీయాలు భిన్నంగా ఉంటాయని, కర్ణాటక ఓటర్లు విజ్నత కలిగిన వారని సిద్ద రామయ్య పేర్కొన్నారు. సమయం అనుకూలించినప్పుడు ముఖ్యమంత్రి ఎవరనేది స్పష్టత వస్తుంది తప్ప, తొందరపడితే ఎలాంటి ఫలితాలు ఉండవని విలేఖరులతో పిచ్చాపాటి గా మాట్లాడారు సిద్ద రామయ్య.

English summary
If the chair is not empty, how can I become chief minister? Former Chief Minister Siddhartha Ramayya questioned the media. He spoke to the media at the Hubli airport on Wednesday.And he said As a cm Kumarasamy is doing good works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X