• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇది ‘No Kissing Zone’, ముద్దు పెట్టుకోకూడదని రోడ్డుపై ఎందుకు రాశారు

By BBC News తెలుగు
|
ముద్దు

'నో స్మోకింగ్', 'నో పార్కింగ్ జోన్' అని రాసి ఉండటం మీరు చూసే ఉంటారు.

అది ఎక్కడైనా సహజంగా కనిపించే దృశ్యమే.

కానీ ముంబయిలో 'నో కిస్సింగ్ జోన్' ఏర్పాటు చేసుకున్నారు ఒక కాలనీవాసులు.

ఇక్కడ ఎవరూ ముద్దు పెట్టుకోకూడదు అని తేల్చి చెప్పారు.

ఇంతకీ వాళ్లు 'నో కిస్సింగ్ జోన్' ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు?

'నో కిస్సింగ్ జోన్' ఎందుకు

ముంబయిలోని సత్యం శివం సుందరం సొసైటీ వారు రెండు నెలల క్రితం తమ సొసైటీకి ఎదురుగా ఉన్న ఒక రోడ్డుపై 'నో కిస్సింగ్ జోన్' అని రాయించారు.

రెండు నెలలకు క్రితం వరకు ఇక్కడ అంతా మామూలుగానే ఉండేది.

కానీ లాక్‌డౌన్‌తోపాటే వీరికి కొత్త సమస్య మొదలైంది.

కోవిడ్-19 వల్ల ముంబయిలో మెరైన్ డ్రైవ్, వర్లీ సీ-ఫేస్‌ ప్రాంతాల్లో జనం కూర్చోవడానికి అనుమతి లేదు.

వీటితోపాటూ నగరంలో చాలా ప్రాంతాలు మూసివేయడంతో జంటలు కూర్చుని సరదాగా గడపడానికి ఎక్కడా చోటు దొరక లేదు.

https://www.youtube.com/watch?v=XVkrai-I1d0

దాంతో జంటలు ఈ సొసైటీకి రావడం మొదలైందని అక్కడి వాళ్లు చెప్పారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఈ రోడ్డుపై చాలా వాహనాలు ఆగేవని, తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు అక్కడ రోడ్డుపై కూర్చునేవారని, మెల్లమెల్లగా బైకుల్లో, కార్లలో వచ్చే ప్రేమ జంటలు అక్కడ సరదాగా గడపడం మొదలయ్యిందని, అది చివరకు అశ్లీల చేష్టల వరకూ వెళ్లిందని సొసైటీవాసులు చెప్పారు.

జంటల చేష్టలతో విసిగిపోయిన సొసైటీ వాసులు 'నో కిస్సింగ్ జోన్‌' ఏర్పాటు చేశారు.

ప్రేమ జంటలకు హెచ్చరికగా ఉండాలనే తమ రోడ్డు మీద అలా రాయించినట్టు సొసైటీ వాసులు చెప్పారు.

ప్రేమ జంటల అశ్లీల చేష్టలను మొదట రుచీ పరేఖ్ చూశారు. ఆమె ఒక భవనంలో ఉంటారు.

"రెండోసారి లాక్‌డౌన్ పెట్టినపుడు ఒక జంట ఉదయం, సాయంత్రం వచ్చేది. కానీ ముద్దులను మించి అశ్లీల పనులకు దిగేది. మేం వాళ్లకు నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించి చూశాం" అని ఆమె బీబీసీతో అన్నారు.

ఆ తర్వాత సొసైటీ వాళ్లు రోడ్డు మీద కూర్చున్న జంటల ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"పోలీసులు వచ్చి అక్కడ కూర్చునే జంటలను తరిమికొట్టేవారు. కానీ పోలీసులు వెళ్లిన తర్వాత వాళ్లు మళ్లీ వచ్చేవారు" అని సొసైటీ అధ్యక్షుడు వినయ్ అనుసుంకర్ చెప్పారు.

దాంతో ప్రేమ జంటలకు ఒక హెచ్చరికలా ఉండేందుకు సొసైటీవాసులు ఆ రోడ్డు మీద 'నో కిస్సింగ్ జోన్' అని రాశారు.

kiss

ఈ ఆలోచన ఎలా వచ్చింది

సొసైటీ అధ్యక్షుడు వినయ్ అనుశుంకర్ తమ కాలనీ వాళ్లకు ఈ ఐడియా ఇచ్చారు.

"మేం ముంబయిలో చాలా బోర్డులు చూశాం. దాంతో నాకు 'నో కిస్సింగ్ జోన్' ఐడియా వచ్చింది. సొసైటీలోని చాలా మంది ఈ యువతీయువకుల చేష్టల గురించి ఫిర్యాదు చేసేవాళ్లు. దాంతో దీనితో పోరాడాలని మేం ప్రయత్నించాం" అని ఆయన అన్నారు.

అమ్మాయిలు, అబ్బాయిలు అక్కడ నిలబడి మాట్లాడుకుంటే తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని, కానీ మిగతా పనులు ఆపాలని సొసైటీ వాళ్లు చెబుతున్నారు.

"ఇది వారు ముద్దు పెట్టుకుంటున్నారని కాదు. అశ్లీల పనుల గురించే. ఆ అబ్బాయిలు, అమ్మాయిలు అశ్లీల చేష్టలను మేం మాటల్లో చెప్పలేం" అని రుచి చెప్పారు.

మేం కిటికీలు మూసుకుంటున్నాం

అలాంటి జంటలు సాయంత్రం దాదాపు ఐదు గంటల సమయంలో అక్కడకు వస్తుంటాయని సొసైటీ వాళ్లు చెబుతున్నారు.

"సాయంత్రం మేం కిటికీ దగ్గర టీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటాం. వాళ్ల చేష్టల వల్ల మేం ఆ కిటికీని మూసుకోవాల్సి వస్తోంది. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్లు అలాంటివి చూడ్డం బాగుండదు కదా" అని రుచి అన్నారు.

అక్కడికి వచ్చే యువతీ యువకులకు నచ్చజెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించామని కొన్నిసార్లు స్వయంగా చెప్పామని, ఒక్కోసారి సెక్యూరిటీతో వాళ్లకు చెప్పి చూశామని సొసైటీ వాసులు చెబుతున్నారు.

https://www.youtube.com/watch?v=I2MWrBiNzZk

నో కిస్సింగ్ జోన్ వల్ల ఏదైనా లాభం ఉందా

'నో కిస్సింగ్ జోన్' అని రాసిన తర్వాత ఇప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు అక్కడకు రావడం తగ్గిందని రుచి చెప్పారు. కొన్నిసార్లు వాళ్లు వచ్చినా తమ సొసైటీ ముందు అశ్లీలంగా ప్రవర్తించడం లేదని అన్నారు.

"నేను ముద్దు పెట్టుకోడానికి వ్యతిరేకం కాదు. కానీ జంటలు చేస్తున్న పనుల వల్ల జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అసలు ప్రేమంటే ఏంటో వాళ్లు తెలుసుకోవాల్సి ఉంది" అని వినయ్ అనుశుంకర్ అన్నారు.

కోవిడ్ వల్ల ఏమైంది

ముంబయిలో మెరైన్ డ్రైవ్, బాంద్రా ఏరియాలోని బాండ్‌స్టాండ్, వర్లీ సీ-ఫేస్ జంటలు కలుసుకోడానికి అనువుగా ఉండే ప్రాంతాలు.

ఉదయం నుంచి రాత్రి వరకూ ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటారు.

అయితే, కరోనా వ్యాప్తితో ముంబయిలోని బహిరంగ స్థలాల్లో ఎక్కడా ప్రజలను అనుమతించడం లేదు. మెరైన్ డ్రైవ్, బాంద్రా బాండ్‌స్టాండ్, వర్లీ సీ-ఫేస్ దగ్గర ఉదయం నాలుగు గంటలు, సాయంత్రం మూడు గంటలు మాత్రమే జనాలను అనుమతిస్తున్నారు.

మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి అక్కడకు వచ్చే వారిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముంబయి పోలీసులు చర్యలు కూడా తీసుకుంటున్నారు.

మరోవైపు కరోనా కరోనా వ్యాపిస్తుందనే భయంతో సీ-ఫేస్, గిర్‌గావ్ చౌపాటీ, జుహులాంటి ప్రాంతాలు కూడా మూసేశారు. దాంతో సరదాగా గడపడానికి ఎక్కడికి వెళ్లాలి అనే ప్రశ్న ప్రేమ జంటల్లో మొదలైంది.

https://www.youtube.com/watch?v=k8VrJVuZoKg

ప్రేమికులు ఏమనుకుంటున్నారు

ముంబయిలో ప్రేమ జంటలకు చోటేది అనే అంశం ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది. కరోనా వల్ల ఇప్పుడు నగరంలోని బహిరంగ ప్రాంతాలన్నీ మూసేశారు. దాంతో ప్రేమ జంటలు కలుసుకోవడం మరింత కష్టంగా మారింది.

కాలేజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయి పేరు రాయద్దనే షరతుతో దీనిపై మాట్లాడాడు.

"లాక్‌డౌన్‌లో ఒక్కసారి కూడా కలవలేకపోయాం. ఆ తర్వాత బీచ్, గార్డెన్స్ అన్నీ మూసేశారు. ఇప్పుడు మేం ఎక్కడ కలుసుకోవాలి. రోడ్డు మీద కూచోవడం తప్ప వేరే దారి లేదు. అయినా మేం ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు" అని అన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
This is ‘No Kissing Zone’, why this was written on the road
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X