• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిక్ టాక్ పోతుందా .. అయితే ప్రత్యామ్నాయం ఉందిగా .. చైనా యాప్స్ కు ప్రత్యామ్నాయాలివే !!

|

చాలాకాలం నుండి చైనా యాప్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ చైనాల మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో భారతదేశం సంచలన నిర్ణయం తీసుకొని 59 చైనా యాప్స్ ను నిషేధిస్తున్నట్లు గా ప్రకటించింది. అయితే భారతీయులు తమకు తెలీకుండానే అత్యధికంగా వినియోగించే చైనా యాప్స్ టిక్ టాక్, హలో, లైకి,యూసీ బ్రౌజర్ , బ్యూటీ ప్లస్, న్యూస్ డాగ్, క్యాం స్కానర్ వంటి యాప్స్ కేంద్ర ప్రభుత్వం నిషేధించిన జాబితాలో ఉండటంతో ఆ యాప్స్ నిషేధిస్తే వాటికి ప్రత్యామ్నాయం ఏమిటి అన్న ప్రశ్న అందరికీ ఉత్పన్నమవుతుంది. ఇండియా నిషేధించిన 59 చైనా యాప్స్ స్థానంలో వాటిని రీప్లేస్ చేయగలిగిన మరికొన్ని యాప్స్ ఉన్నాయి. అవేంటంటే..

చైనా క్యాబేజీ వ్యూహం .. ఇండియాతోనూ అదే స్ట్రాటజీ ..ఇప్పటివరకు డ్రాగన్ కంట్రీ ఆక్రమణల గుట్టు ఇదే..చైనా క్యాబేజీ వ్యూహం .. ఇండియాతోనూ అదే స్ట్రాటజీ ..ఇప్పటివరకు డ్రాగన్ కంట్రీ ఆక్రమణల గుట్టు ఇదే..

 చైనా యాప్స్ కు ప్రత్యామ్నాయ యాప్స్

చైనా యాప్స్ కు ప్రత్యామ్నాయ యాప్స్

గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యొక్క iOS యాప్ స్టోర్ రెండింటిలోనూ చైనీస్ యాప్స్ కు ప్రత్యామ్నాయ యాప్స్ పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి వినియోగదారులు నాణ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, ప్రత్యామ్నాయ బ్రౌజర్‌ల కోసం, గూగుల్ క్రోమ్ బెస్ట్ గా పని చేసే బ్రౌజర్ లలో ఒకటి. డాక్యుమెంట్ లను స్కాన్ చేయడానికి, వినియోగదారులు కామ్‌స్కానర్‌కు బదులుగా గూగుల్ స్కాన్ , అడోబ్ స్కాన్ మొదలైన వాటికి సులభంగా మారవచ్చు. టిక్‌టాక్‌కు బదులుగా మనం డబ్ స్మాష్, రోపోసో మొదలైనవి వాడవచ్చు.

టిక్ టాక్ కు బదులుగా డబ్ స్మాష్ , రోపోసో , పెరిస్కోప్

టిక్ టాక్ కు బదులుగా డబ్ స్మాష్ , రోపోసో , పెరిస్కోప్

టిక్ టాక్.. ప్రస్తుతం అందరినీ తన మాయలో పడేసిన చైనా యాప్.టిక్ టాక్ తో పాటు విగో వీడియో, లైకీ , హలో యాప్ కూడా బాగా పాపులర్ అయిన యాప్స్. అన్నిటికంటే టిక్ టాక్ యాప్ గురించి ప్రజల చింత అంతా ఇంతా కాదు. కేవలం టిక్ టాక్ చూడొద్దు అంటే భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్యలు, భార్యలను వదిలేసిన భర్త లు ఉన్నారు అంటే అది ఎంత వ్యసనంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ యాప్ నిషేధించబడింది అంటే తెగ బాధ పడుతున్న వాళ్లందరికీ ప్రత్యామ్నాయం ఉంది. ఆ ప్రత్యామ్నాయం ఏమిటంటే డబ్ స్మాష్, రొపొసొ, పెరిస్కోప్ లాంటి వాటిని మనం ట్రై చేయొచ్చు. నాలుగు రోజులు అలవాటైతే ఇవి కూడా టిక్ టాక్ లా అంతే ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి.

యూసీ బ్రౌజర్ కు ప్రత్యామ్నాయం ఇవే

యూసీ బ్రౌజర్ కు ప్రత్యామ్నాయం ఇవే

చైనా యాప్ అయిన యూసీ బ్రౌజర్ ను నిషేధించిన నేపథ్యంలో ఆ స్థానంలో మనం గూగుల్ క్రోమ్, ఒపేరా, మొజిల్లా ఫైర్ఫాక్స్ వంటి బ్రౌజర్లలో ట్రై చేయొచ్చు. చాలా ఫోన్ లలో వార్తలు ఫోటోలు వీడియోలు ఇలా ఏది కావాలన్నా యూసీ బ్రౌజర్ ను డిఫాల్ట్ ఇవ్వడం గానీ, యూసీ బ్రౌజర్ ను సూచించటం గానీ జరుగుతోంది. ఆ స్థానంలో మనం ఇంటర్నెట్ లో కావలసినవి వెతుక్కోవడానికి గూగుల్ క్రోమ్, ఓపెరా వంటి యాప్స్ వాడొచ్చు.

సీక్రెట్ ఫోల్దర్స్ కోసం యాప్ లాక్,వాల్ట్ కు బదులుగా ఇవి వాడండి

సీక్రెట్ ఫోల్దర్స్ కోసం యాప్ లాక్,వాల్ట్ కు బదులుగా ఇవి వాడండి

మన ఫోన్లలో ఏదైనా సీక్రెట్ గా దాచుకోవాలి అనుకుంటే ఫోటోలు, వీడియోలు, యాప్స్ ఇతరులకు కనిపించకుండా ఉండేందుకు యాప్ లాక్, వాల్ట్ వాడుతుంటాం. ఇప్పుడు వీటికి బదులుగా స్మార్ట్ యాప్ లాకర్, లాక్ యాప్ ఫింగర్ప్రింట్, కీప్ సేఫ్, యాప్ లాక్, లాక్ మై ఫిక్స్ సీక్రెట్ ఫోటో వాల్ట్ తదితర యాప్స్ ను వాడొచ్చు. ఇవి కాక ఇంకా చాలా యాప్స్ మన ఫోటోలు, వీడియోలు, యాప్స్ ను సేఫ్ గా ఉంచటానికి అందుబాటులో ఉన్నాయి. ప్రతిదానికి దానికి తగ్గ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఉంది.

యూ డిక్షనరీకి బదులుగా గూగుల్ ట్రాన్స్ లేట్ , సెక్యూరిటీ యాప్స్ కూడా మనకు బోలెడు

యూ డిక్షనరీకి బదులుగా గూగుల్ ట్రాన్స్ లేట్ , సెక్యూరిటీ యాప్స్ కూడా మనకు బోలెడు

ఇతర భాషల్లో పదాలు అర్థాలు తెలుసుకోవడం కోసం చాలా మంది యూ డిక్షనరీ యాప్ ను వాడుతున్నారు. ఇప్పుడు దాని స్థానంలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, గూగుల్ ట్రాన్స్ లేట్ లాంటి యాప్స్ వాడవచ్చు. మొబైల్ లోకి ఎలాంటి వైరస్ ప్రవేశించకుండా ప్రమాదకరమైన ఫైల్స్ ను తొలగించే సెక్యూరిటీ ఆప్స్ విషయంలో కూడా క్లీన్ మాస్టర్, క్యాచే క్లీనర్ , డ్యూ క్లీనర్, క్యూ సెక్యూరిటీ సెంటర్, డ్యూ ప్రైవసీ వంటివంటి చైనా యాప్స్ చాలామంది వినియోగిస్తున్నారు. ఇక ఇలాంటి వారు మొబైల్ లో డీ ఫాల్ట్ గా వచ్చే యాప్స్ కు బదులు ఏ వి జి, అవాస్టా, నార్తన్ యాంటీవైరస్ వంటి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

బ్యూటీ ప్లస్ బదులు b6 12.. షేర్ ఇట్ బదులు షేర్ ఫైల్స్, ఫైల్స్ బై గూగుల్

బ్యూటీ ప్లస్ బదులు b6 12.. షేర్ ఇట్ బదులు షేర్ ఫైల్స్, ఫైల్స్ బై గూగుల్

ఒకరి నుంచి ఒకరికి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, ఫైల్స్ కానీ పంపడానికి ఇంతకాలం ఎక్కువగా షేర్ ఇట్ యాప్ ను అందరు వినియోగించారు. షేర్ ఇట్, జెండర్ వంటి యాప్స్ ను నిషేధిస్తే వాటి స్థానంలో షేర్ ఫైల్స్, ఫైల్స్ బై గూగుల్ ను వినియోగించవచ్చు. ఇక ఫోటోలు మరింత అందంగా ఇప్పటివరకు యు క్యామ్, బ్యూటీ క్యామ్, బ్యూటీ ప్లస్ యాప్ లను చాలామంది వాడుతున్నారు. వాటి స్థానంలో పిక్స్ ఆర్ట్, అడోబ్ ఫోటోషాప్, గూగుల్ స్నాప్ సైడ్, b6 12, లైట్ రూమ్ లను ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

వీడియో ఎడిటింగ్ లకు , డాక్యుమెంట్ స్కానింగ్ లకూ ప్రత్యామ్నాయం

వీడియో ఎడిటింగ్ లకు , డాక్యుమెంట్ స్కానింగ్ లకూ ప్రత్యామ్నాయం

వైవా వీడియో, వైవా కట్, ఫిల్మోర వంటి యాప్స్ ను వీడియోలను సులభంగా ఎడిట్ చేసి,వాటికి ఆడియోలను జోడించడానికి వాడుతున్నారు. వీటి స్థానంలో కైన్ మాస్టర్, అడోబ్ ప్రీమియర్ క్లిప్, మ్యాజిస్టో యాప్స్ ను వాడుకోవచ్చు. ప్రస్తుతం అందరం ఏమైనా డాక్యుమెంట్లను,ఫోటోలను స్కాన్ చేయాలంటే క్యాం స్కానర్ వాడుతున్నారు. క్యాం స్కానర్ కూడా నిషేధించిన జాబితాలో ఉండడంతో ప్రత్యామ్నాయంగా అడోబ్ స్కాన్, మైక్రోసాఫ్ట్ లెన్స్, ఫొటో స్కాన్ బై గూగుల్ లాంటి యాప్స్ ను వాడవచ్చు. అంతేకాకుండా డాక్ స్కానర్ పిడిఎఫ్ క్రియేటర్, డాక్యుమెంట్ స్కానర్ పిడిఎఫ్ క్రియేటర్ వంటి దేశీయ యాప్స్ కూడా వాడవచ్చు.

  Fact Check : Google Pay App ని RBI బ్యాన్ చేసింది అనే వార్త లో నిజమెంత? || Oneindia Telugu
  ప్రత్యామ్నాయ యాప్స్ పై దృష్టి పెట్టండి

  ప్రత్యామ్నాయ యాప్స్ పై దృష్టి పెట్టండి

  బాగా ఎక్కువగా వినియోగించే చైనా యాప్స్ ను ప్రభుత్వ నిషేధించడంతో ఎలా ఆలోచిస్తున్న వారు ప్రత్యామ్నాయంగా ఈ యాప్స్ ను వాడి చూడండి. అలవాటైతే ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకెందుకాలస్యం ఫేవరెట్ యాప్స్ పోయాయని బాధను పక్కనపెట్టి ,చాలా కాలంగా చైనాను ఆర్ధికంగా బలోపేతం చేస్తున్న మనం ఆ పనికి స్వస్తి చెప్పాల్సిన తరుణం అని కేంద్రం తేల్చి చెప్పింది. కనుక ప్రత్యామ్నాయ యాప్స్ పై దృష్టి పెట్టండి.

  English summary
  There are plenty of alternative apps to the Chinese one on both – Google Play Store and Apple’s iOS App Store – so users need not worry about the quality. For instance, for alternative Instead of tiktok we can use dub smash , roposo etc.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X