వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ప్రధాని నరేంద్ర మోడీ విజయం: బీహార్ ఫలితాలపై చిరాగ్ పాశ్వాన్

|
Google Oneindia TeluguNews

లోక్‌ జన్ శక్తి పార్టీ (ఎల్‌జెపి) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ బీహార్ ఎన్నికల్లో బిజెపి ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును ప్రధాని నరేంద్ర మోడీ కనబరిచారని ప్రశంసించారు. బిజెపి పార్టీపై, ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రజల నిరంతర నమ్మకాన్ని ఈ ఫలితాలు చూపిస్తాయని ఆయన అన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో బాగా పోరాడిందని, ఓట్ల వాటా స్వల్పంగా పెరిగిందని పేర్కొన్న చిరాగ్ పాశ్వాన్ బీహార్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయాన్ని, కేవలం బీజేపీ విజయం గా అభివర్ణించారు.

Recommended Video

#Biharelectionresults2020: 'This Is PM Narendra Modi's Win'| Chirag Paswan On Bihar Results
బీహార్ లో విజయం ... ప్రధాని మోడీ విజయం.. పాశ్వాన్ ట్వీట్

బీహార్ లో విజయం ... ప్రధాని మోడీ విజయం.. పాశ్వాన్ ట్వీట్

మొదటి నుండి బీహార్లో ఎన్నికల ప్రచారంలో నితీష్ కు వ్యతిరేకంగా ప్రచారం సాగించిన చిరాగ్ పాశ్వాన్ జేడీయూను బీహార్ ఎన్నికల్లో బాగా ఇబ్బంది పెట్టారు. జేడీయూకు నష్టం చేశారు. ఇక ఈ విజయాన్ని ప్రధాని నరేంద్రమోడీ విజయమని మాట్లాడిన చిరాగ్ పాశ్వాన్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు తమ నమ్మకాన్ని చూపించారు. ప్రజలు ఇప్పటికీ బిజెపి పట్ల ఉత్సాహంగా ఉన్నారని ఫలితాలు స్పష్టం చేశాయి. ఇది ప్రధాని నరేంద్ర మోడీ విజయం" అని హిందీలో ట్వీట్ చేశారు.

కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయినా ..ఎల్జేపీ ఇంపాక్ట్

కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయినా ..ఎల్జేపీ ఇంపాక్ట్

చిరాగ్ పాశ్వాన్ యొక్క ఎల్జెపి కేవలం ఒక సీటును గెలుచుకుంది. బిజెపి 74 సీట్లు గెలుచుకుంది. దాని ప్రధాన ప్రత్యర్థి, తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జెడి 75 స్థానాలను గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి మొత్తంగా 125 సీట్లను గెలుచుకుంది, ఇది 243 బీహార్ అసెంబ్లీస్థానాలలో సగం కంటే ఎక్కువ. చాలా మంది ఎగ్జిట్ పోల్స్ మహా కూటమి సులువుగా విజయం సాధిస్తాయని తేల్చినా ఎన్డీయే కూటమి తన బలాన్ని నిరూపించుకుంది .ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడి ని చాలాసార్లు ప్రశంసించారు చిరాగ్ పాశ్వాన్ . తనను తాను ప్రధానమంత్రికి హనుమంతుడు అని కూడా చెప్పుకున్నారు.

ఆది నుండీ నితీష్ తో విబేధించి జేడీయూకి నష్టం చేసిన చిరాగ్

ఆది నుండీ నితీష్ తో విబేధించి జేడీయూకి నష్టం చేసిన చిరాగ్

మొత్తానికి ఎన్డీఏ సాధించిన విజయాన్ని చిరాగ్ పాశ్వాన్ , ప్రధాన నరేంద్ర మోడీ సాధించిన విజయంగా, బీజేపీ సాధించిన విజయంగా అభివర్ణించారు కానీ నితీష్ కుమార్ కు ఈ విషయంలో ఏ ప్రమేయం లేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.ఎల్జెపి అభ్యర్థులందరూ ఎటువంటి కూటమి లేకుండా తమంతట తాముగా ఘనంగా పోరాడారు.

పార్టీ ఓటు వాటా పెరిగింది. బీహార్ ఫస్ట్ , బీహారీ ఫస్ట్ అనే నినాదంతో చిరాగ్ పా శ్వాన్ ఎన్నికలకు వెళ్లారు. ఇది ప్రతి జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపకరించింది అని, ఈ నిర్ణయం భవిష్యత్తులో పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికి పనికొస్తుందని పాశ్వాన్ అన్నారు.ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో విభేదాల కారణంగా చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే నుండి తప్పుకున్నారు. జేడీయూకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి, జెడియు పోటీ చేసిన స్థానాలలోనే జెడియూ ఓటు బ్యాంకును చీల్చారు.

English summary
LJP chief Chirag Paswan has praised Prime Minister Narendra Modi for the BJP's better-than-expected performance in the Bihar election. This is Prime Minister Narendra Modi's win," he tweeted in Hindi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X