వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మోసగాడివి, క్యారెక్టర్ లేనిదాన్ని చేశావు’: రాహుల్‌తో ప్రత్యూష చివరి సంభాషణ

|
Google Oneindia TeluguNews

ముంబై: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ హిందీ టీవీ నటి, చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌తో జరిపిన చివరి ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్‌ను సోమవారం కోర్టుకు సమర్పించారు. రాహుల్ ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మూడున్నర నిమిషాలు నిడివున్న ఈ ఆడియోను న్యాయస్థానం వింది.

ఏప్రిల్ 1న ఆత్మహత్మకు గంట ముందు రాహుల్‌తో ప్రత్యూష ఫోన్‌లో 3నిమిషాల 21 సెకండ్లు మాట్లాడింది. వారి సంభాషణకు సంబంధించిన ఆడియో ఇలా ఉంది.

This is what Pratyusha Banerjee told Rahul Raj Singh in her last 3 minute 21 seconds long conversation with him

ప్రత్యూష: నన్ను క్యారెక్టర్ లేనిదానిలా ముద్రవేశారు. చంపుతామని నాకు బెదింపు కాల్స్ వస్తున్నాయి. మా అమ్మనాన్నలను కూడా ఫోన్లో బెదిరిస్తున్నారు. నాకు జీవితంలో ఇంకేం మిగిలిందిప్పుడు?

రాహుల్: ఇవేమి పెద్ద విషయాలు కాదు.

ప్రత్యూష: రాహుల్ నీ ఈగోను పక్కనపెట్టు. ఇవేమి పెద్ద విషయాలు కాదని ఎలా చెబుతావు.
ప్రత్యూష మాట్లాడుతుండగానే రాహుల్ రాజ్ సింగ్ ఫోన్ కట్ చేశాడు.

కాగా, వీరిద్దరి మధ్య జరిగిన మరో ఫోన్ సంభాషణ ఆడియోను 'మిడ్-డే' పత్రిక మంగళవారం ప్రచురితం చేసింది. దీంట్లో సంభాషణ ఇంకా ఇలా కొనసాగింది.

ప్రత్యూష: నువ్వు మోసగాడివి. నన్ను వంచించావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను విడదీశావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో.

రాహుల్: ఏమైంది. నేను ఇంటికి వచ్చి నీతో మాట్లాడతాను. ఇంటికి వస్తున్నాను. నేను ఇంటికి వచ్చే వరకు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకు.

వీరి మధ్య జరిగిన చివరి సంభాషణ ఇలా సాగింది. కాగా, ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం అతడు బెయిల్‌పై బయటికి వచ్చాడు. ప్రత్యూష ఆత్మహత్య కేసుపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

English summary
The audio of the last call that Pratyusha made to her boyfriend Rahul before hanging herself has been retreived and it reveals something extremely shocking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X