వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లేన్‌లో వెనుక నుండి ఆమెను టచ్ చేయబోతే..: వీడియో తీసి, నెట్లో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: మహిళలకు రోడ్లు, బస్సుల్లో, రైళ్లలోనే కాదు.. విమానాల్లోను వేధింపులు తప్పడం లేదు. ముంబై నుండి భువనేశ్వర్‌కు వెళ్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. జార్ఖండ్‌కు చెందిన మహిళ విమానంలో భువనేశ్వర్ వెళ్తుండగా ఇది జరిగింది.

వెనుక సీటులో ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతను చూసేందుకు డీసెంటుగానే ఉన్నాడు. కానీ అతను సీట్ల మధ్య నుండి మహిళను తాకడానికి ప్రయత్నించాడు. దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం చేసి.. వాటిని వీడియో తీసింది. ఫోటోలు కూడా తీసింది.

ఆ తర్వాత కేకలు వేసింది. అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణీకులు అండగా నిలిచారు. ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన పైన ఎఫ్ఐఆర్ నమోదయింది. అంతేకాదు, ఆమె సదరు వీడియోను ఇంటర్నెట్లో పెట్టింది.

 This is What A Young Woman Did to Her Alleged Molester

యూట్యూబ్‌లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు దీనిని లక్షా ఇరవై అయిదువేల మందికి పైగా చూశారు. ఈ సంఘటన 31న జరిగింది. అతను తనను ముట్టుకునేందుకు పలుమార్లు ప్రయత్నించాడని చెప్పింది.

ఇలాంటివి జరిగినప్పుడు ఎవరైనా భయపడతారని, కానీ అలా చేయడం కూడా నేరం అనేది తన అభిప్రాయమని ఆమె పేర్కొంది. అందరి ముందు అతడికి అవమానం జరగాలని భావించి గట్టిగా అరిచానని చెప్పింది. అతను పలు కంపెనీలకు చైర్మన్ అని తెలుస్తోంది. అతనిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని వదిలేశారని తెలుస్తోంది.

నీవు నన్ను క్షమించమని అడుగుతున్నావని, నీకు నన్ను ఎక్కడైనా టచ్ చేస్తావా అని ప్రశ్నించింది. అతను తన ముఖం దాసుకొని.. ఆమెను క్షమాపణ కోరినట్లుగా తెలుస్తోంది. వారిద్దరి మధ్య వాదన కూడా జరిగింది. దీనిని ఇప్పుడు ఇంటర్నెట్లో జోరుగా చూస్తున్నారు.

నేను ఓ కూతురుకి తండ్రినే: ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి

తన పైన వచ్చిన ఆరోపణలపై నిందితుడు స్పందించారు. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారని, తాను కూడా పెద్ద తప్పు చేశానని చెప్పాడు. అనంతరం తాను కూడా ఓ కూతురికి తండ్రినేనని చెప్పాడు.

English summary
She posted the video on youtube where it swiftly went viral, viewed about 1.25 lakh times. It has also been shared many times over on social media sites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X