వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఆరేళ్ల పిల్లాడి తపన చూసి పెటా మురిసిపోయింది..అవార్డు ఇచ్చేసింది..!

|
Google Oneindia TeluguNews

మిజోరాం: ఆ చిన్నారి వయస్సు ఆరేళ్లు. ఆడిపాడే వయస్సు అది. సరదాగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నాడు. ఒక్కసారిగా ఇంటికి వెళ్లి కన్నీటి పర్యంతం అయ్యాడు. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాడు. ఇంతకీ ఆ బాలుడని కలచివేసిన ఘటన ఏది..? ఎందుకు తల్లడిల్లిపోయాడు.. ఆస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది...?

 ప్రాణిని చూసి చలించిపోయిన డెరెక్

ప్రాణిని చూసి చలించిపోయిన డెరెక్

ఈశాన్య భారత దేశంలోని మిజోరాం రాష్ట్రంలో ఆరేళ్ల చిన్నారికి ప్రతిష్టాత్మక పెటా అవార్డు లభించింది. అసలు పెటా అవార్డు ఆ వయసుల్లో ఉన్న చిన్నారికి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ చిన్నారి ఏమి చేశాడో తెలిస్తే పెద్దవాళ్లం అయిన మనమే ఆలోచనలో పడిపోతాం. ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బాలుడు పేరు డెరెక్ లాల్‌చన్హిమా. వయస్సు ఆరేళ్లు. ఆడిపాడే వయస్సులో ఉన్న ఈ కుర్రాడు ఒక ప్రాణి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటం చూసి చలించిపోయాడు.

సైకిల్ టైర్ కింద పడ్డ కోడిపిల్ల

డెరెక్ సరదాగా తన బుజ్జి సైకిల్‌పై తొక్కుకుంటూ వెళుతున్నాడు. పాపం చూసుకోలేదు. అటుగా చంగుచంగున పరుగులు తీస్తూ వచ్చిన ఓ కోడిపిల్ల డెరెక్ సైకిల్ టైర్ కింద పడి గాయాలపాలైంది. వెంటనే డెరిక్ ఆ కోడిపిల్లను చూసి చాలా బాధపడ్డాడు. విపరీతంగా ఏడ్చేశాడు. వెంటనే దాన్ని తీసుకుని తన ఇంటికి పరుగులు తీశాడు. కోడిపిల్లను హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిందిగా తన తల్లిదండ్రులను కోరాడు. అయితే అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆ కోడిపిల్ల మృతి చెందింది. కోడిపిల్ల చనిపోయిన విషయాన్ని డెరిక్‌కు తన తల్లిదండ్రులు చెప్పారు. ఇదంతా ఆ చిన్నారికి అర్థం కాలేదు.

 రూ.10 జేబులో పెట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీసిన డెరిక్

రూ.10 జేబులో పెట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీసిన డెరిక్

ఎలాగైనా కోడిపిల్లను బతికించాలన్న తపన తనలో పెరిగిపోయింది. వెంటనే ఓ ఆస్పత్రికి కోడిపిల్లను తీసుకుని పరుగులు తీశాడు. ఏమైంది అని అక్కడి నర్సు ఈ చిన్నారిని ప్రశ్నించింది. జరిగిన విషయం చెప్పాడు. కోడిపిల్ల తన సైకిలు టైరు కింద పడిందని దాన్ని బతికించాలంటూ డెరిక్ నర్సును ప్రాథేయపడ్డాడు. అంతేకాదు తన దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటూ అక్కడి నర్సుకు చూపించాడు. ఆమె వెంటనే డెరిక్ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఓచేతిలో చనిపోయిన కోడిపిల్ల మరో చేతిలో పది రూపాయల నోటు పట్టుకుని ఉన్న డెరిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోడిపిల్లను బతికించేందుకు పది రూపాయలు సరిపోవేమో అని వంద రూపాయలు తీసుకొద్దామని తిరిగి ఇంటికి చేరుకున్నాడు డెరిక్.

సోషల్ మీడియాలో డెరిక్ ఫోటో వైరల్

డెరిక్ ఫోటో సోషల్ మీడియాను చుట్టేసింది. కోడిపిల్లను కాపాడుదామన్న తనలోని తపన ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. తన పాఠశాలలో డెరిక్‌ను సన్మానించారు. ఫేస్‌బుక్‌లో ఫోటోకు లక్ష లైకులు 94వేల షేర్లు వచ్చాయి. డెరిక్‌కు మూగజీవుల పట్ల ఉన్న ప్రేమను ఆప్యాయతపై నెటిజెన్లు ప్రశంసలు కురిపించారు. ఆ చిన్నారి అమాయకత్వం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది... కోడిపిల్లను కాపాడాలన్న ఆ తపన తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేశారు. ఆ కోడిపిల్లకు తగిన గాయంతో ఆ చిన్నపిల్లాడు ఎంతగా తల్లడిల్లిపోయాడో అతన్ని చూస్తే అర్థమవుతోందంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇక ఫోటో వైరల్ అవడంతో ఆ చిన్నారికి పెటా సంస్థ కంపాషినేట్ కిడ్ అనే అవార్డును స్కూలు యాజమాన్యం ద్వారా ప్రదానం చేసింది.

English summary
A six-year-old boy from Mizoram, who tried to save the life of a chicken he accidentally ran over, has been awarded the 'Compassionate Kid' award by PETA India. He was awarded with this award as he was very compassionate towards the bird.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X