వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫుడ్‌ ఆర్డర్ చేశారా? కాస్తాగండి.. డ్రోన్ తీసుకొచ్చేస్తుంది! (వీడియో)

లక్నోలో ట్రాఫిక్‌ సమస్యలతో ఫుడ్‌ డెలివరీ కష్టంగా మారడంతో గాల్లోంచే ఫుడ్‌ డెలివరీ చేయాలనే ఆలోచన తట్టింది ఆన్ లైన్ కాకా అనే కంపెనీకి. ఆలోచన రావడమే తరువాయి దానికి కార్యచరణ కూడా రూపొందించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో: హోటల్‌కు ఏదైనా ఆర్డర్‌ ఇస్తే లేటవుతుందా? ఆకలి నశించిన తరువాత ఫుడ్‌ మీ ఇంటికి వస్తోందా? 'ట్రాఫిక్‌ సమస్యతో లేటైంది సార్‌.. అడ్రస్‌ దొరకడం కష్టంగా మారింది సార్‌..' అని డెలివరీ బాయ్ లు చెప్పే కాకమ్మ కబుర్లు చికాకు కలిగిస్తున్నాయా?

అయితే కొన్ని రోజులు ఆగండి.. మీకు ఈ తిప్పలన్నీ తప్పిపోతాయి. ఈ సమస్యలకు లక్నోలోని ఆన్‌లైన్‌ కాకా ఫుడ్‌ డెలివరీ కంపెనీ వినూత్న పరిష్కారం కనిపెట్టింది. డ్రోన్లతో ఫుడ్ డెలివరీ చేసేందుకు ఈ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

లక్నోలో ట్రాఫిక్‌ సమస్యలతో ఫుడ్‌ డెలివరీ కష్టంగా మారడంతో గాల్లోంచే ఫుడ్‌ డెలివరీ చేయాలనే ఆలోచన తట్టింది ఈ కంపెనీకి. ఆలోచన రావడమే తరువాయి దానికి కార్యచరణ కూడా రూపొందించింది.

డ్రోన్‌ కెమెరాలతో వీడియోలు తీసినట్లే డ్రోన్‌లతో ఫుడ్‌ డెలివరీ చేస్తే ఎలా ఉంటందనేది ఈ కంపెనీ ఐడియా. ఈ ఆలోచన విజయవంతం కూడా అయింది. డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తే.. డెలివరీ టైమ్‌లో 1/3 వంతు తగ్గిందట. అంతేకాదండోయ్‌.. టూ వీలర్‌ అవసరం ఉండదని, దీంతో పొగకాలుష్యం కూడా తగ్గుతుందని ఈ కంపెనీ చెబుతోంది.

అయితే ఈ విధానాన్ని రూపొందించడానికి కాకా ఆన్‌లైన్‌ ఉద్యోగులు అహద్‌ అర్షద్‌, మొహద్‌ బిలాల్‌లు ఒక సంవత్సరం పాటు కష్టపడ్డారట. ఇప్పటికే దీనికి సంబంధించి టెస్టు డ్రైవ్‌ నిర్వహించామని, కేంద్రవిమానాయ శాఖ, లక్నో డీఎంల నుంచి అనుమతుల కోసమే వేచిచూస్తున్నామని కంపెనీ సోషల్‌ మీడియా మేనేజర్‌ వివేక్‌ కుమార్‌ తెలిపారు.

English summary
Online Kaka is a localized online food delivery platform in the City of Nawabs that wants to do something different... it wants to deliver your food to you with the help of drones. If they are successful in getting approval for this scheme, they could become the first such company in north India to do this, and only the second company in India after a pizza delivery chain in Mumbai. "The traffic conditions in Lucknow right now are very poor," says Vivek Kumar, the social media manager of the company, in a conversation with NDTV. "By using drones, we want to reduce the delivery time to 1/3rd of the current time, which is 45 minutes. It will also help us fight pollution caused by two wheelers."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X