వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేద విద్యార్థుల పాలిట దేవుడు: చదువు ఆగకూడదని ఏం చేశాడంటే..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కరోనా సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు పాకి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను, విద్యావ్యవస్థను ఆరోగ్య వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసింది. ఇప్పటికే కోవిడ్ మహమ్మారితో భారత్‌లో విద్యావ్యవస్థ కూడా తీవ్రంగా నష్టపోయింది. దేశం లాక్‌డౌన్‌లోకి ఈ ఏడాది మార్చిలో వెళ్లిపోవడంతో స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక పరీక్షలు కూడా లేకుండానే విద్యార్థులను మరో తరగతికి ప్రమోట్ చేయడం జరిగింది. తాజాగా విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండగా అది కూడా కరోనా కారణంగా జాప్యం జరిగింది. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే అందరికీ స్మార్ట్‌ఫోన్లో లేదో కంప్యూటర్లు లేవు. కొందరు పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఇబ్బందిగా మారింది. అలాంటి వారికోసమే భగవంతుడి రూపంలో అంకిత్ గుప్తా అనే వ్యక్తి ముందుకొచ్చారు.

ఆన్‌లైన్ క్లాసులు..

ఆన్‌లైన్ క్లాసులు..

ప్రస్తుతం దేశంలోని విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో నివసించే కొంతమంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ కాలేకపోతున్నారు. దీనికి కారణం వారి దగ్గర స్మార్ట్‌ ఫోన్ కానీ కంప్యూటర్‌ కానీ లేకపోవడమే. ఇలాంటి వారికోసమే అంకిత్ గుప్తా అనే వ్యక్తి ఈ విద్యాకుసుమాల పాలిట దేవుడయ్యాడు. వారిని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా చదువు వారికి దూరం కాకూడదన్న మంచి ఆలోచనతో వారికి స్మార్ట్‌ఫోన్లను అందజేశాడు. భోపాల్‌కు చెందిన అంకిత్ గుప్తా గతేడాది ఢిల్లీకి వచ్చాడు. సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. ఢిల్లీ అల్లర్ల సమయంలో కూడా గాయపడిన వారికోసం తన సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. లాక్‌డౌన్ సమయంలో గర్భిణీ స్త్రీల కోసం కూడా అంబులెన్స్ ఏర్పాటు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది..

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది..

ఢిల్లీలోని కారావాల్ నగర్‌కు చెందిన సూరజ్ మరియు షైజల్ అనే ఇద్దరు విద్యార్థులు సెకండ్ గ్రేడ్ చదువుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. వారికి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ ఆన్‌లైన్ క్లాసెస్ కావడంతో వారికి స్మార్ట్‌ ఫోన్ లేదు. వారి కుటుంబానికి ఉన్నది ఒకే ఒక సాధారణ ఫోను. తమది రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. ఉన్న ఒకే ఒక సాధారణ ఫోనుతో తమ పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు దూరమయ్యారని ఇప్పుడు అంకిత్ గుప్తా ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌తో తమ పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతారని సంతోషం వ్యక్తం చేస్తూ అంకిత్ గుప్తాకు ధన్యవాదాలు తెలిపారు.

లాక్‌డౌన్ సమయంలో గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్

లాక్‌డౌన్ సమయంలో గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్

ఇదిలా ఉంటే ఢిల్లీలోని భగీరథీ విహార్‌లో నివాసముంటున్న అంజద్ అనే వ్యక్తి తన కథన వివరించాడు. లాక్‌డౌన్ సమయంలో గర్భిణీగా ఉన్న తన భార్య డెలివరీ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని భావించగా వాహనాలు లేవని చెప్పారు. ఆ సమయంలో అంకిత్ గుప్తా అంబులెన్స్‌ను ఏర్పాటు చేయగా వెంటనే హాస్పిటల్‌కు తరలించామని అదే రోజున తన భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పాడు. ఎక్కడి నుంచో వచ్చిన గుప్తా ఇలా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంపై సర్వత్రా
హర్షం వ్యక్తమవుతోంది.

Recommended Video

NSUI Demands Telangana Govt To Postpone Entrance Exams
 ఢిల్లీ అల్లర్ల సమయం నుంచే...

ఢిల్లీ అల్లర్ల సమయం నుంచే...

ఢిల్లీ అల్లర్ల సమయం నుంచే తాను సామాజిక సేవను చేస్తున్నట్లు చెప్పారు అంకిత్ గుప్తా. లాక్‌డౌన్ సమయంలో 17 మంది గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్‌కు తరలించినట్లు చెప్పారు. ఇక కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో చాలా స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారని తెలుసుకుని స్మార్ట్ ఫోన్లు లేని విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందజేశామని తద్వారా వారి చదువులకు బ్రేక్ పడకుండా బాధ్యత తీసుకున్నామని అంకిత్ గుప్తా చెప్పారు. రానున్న రెండు వారాల్లో మరో 200 వందల స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని ఇందుకోసం ఒక జాబితాను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు.

English summary
To help the needy during the coronavirus pandemic, many have tured out to be Messiahs. Ankit Gupta is one such person who helped those struggling with financial constraints, including children who did not have smartphones for online studies
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X