వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సమావేశానికి హజరైన వారిపై చర్యలు తప్పవు, సైకిల్ పార్టీలకు ఈ కష్టాలు తప్పవా ?

ములాయం సింగ్ యాదవ్ కుర్చీకి అఖిలేష్ యాదవ్ ఎసరు పెట్టారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షపదవిని అఖిలేష్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ సమావేశం పార్టీ రాజ్యాంగ విరుద్ద

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం కొత్త మలుపుతిరుగుతోంది. ములాయం స్థానంలో అఖిలేష్ కు పార్టీ నాయకుడిగా బాద్యతలను కట్టబెట్టింది పార్టీ. కి చెందిన ముఖ్యనాయకులంతా అఖిలేష్ సరపన చేరారు.పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకొన్నారు.అఖిలేష్ యాదవ్. అయితే అఖిలేష్ యాదవ్ నిర్వహించిన సమావేశం పార్టీ నియమనిబంధనలకు విరుద్దమని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ఈ సమావేశానికి హజరైన వారిపై చర్యలు తప్పవని ములాయం సింగ్ హెచ్చరించారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో రెండు మూడు రోజులుగా కీలకమైన పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తొలుత అఖిలేష్ ను పార్టీ నుండి బహిష్కరించి ఆయన వర్గీయులు నిర్వహించిన బలప్రదర్శనతో ఆయనపై వేసిన బహిష్కరణ వేటును ములాయం సింగ్ వెనక్కు తీసుకొన్నారు.

ఈ బహిష్కరణ నిర్ణయాన్ని పార్టీ వెనక్కు తీసుకోవడంతో అఖిలేష్ తండ్రికి మరో షాక్ ఇచ్చాడు. ఆదివారం నాడు .పార్టీ జాతీయ కార్యవర్గాన్ని నిర్వహించాడు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్ష బాద్యతలను చేపట్టాడు. ములాయం వర్గానికి చెక్ పెట్టాడు.

పార్టీలో సంక్షోభానికి కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ పి ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయంతీసుకొన్నారు. ఈ పరిణామాలన్నీ ములాయం సింగ్ తో పాటు ఆయన సోదరుడు శివపాల్ కు మింగుడు పడడం లేదు.

 తండ్రి కుర్చీని లాక్కొన్న తనయుడు

తండ్రి కుర్చీని లాక్కొన్న తనయుడు

సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఎన్నుకొంది. అఖిలేష్ యాదవ్ తండ్రి వద్ద ఉన్న పగ్గాలను తీసుకొన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గసమావేశానికి మెజారిటీ నాయకులు హజరయ్యారు. సీనియర్ మంత్రులు, సిట్టింగ్ ఎంఏల్ఏలు, నాయకులు కూడ అఖిలేష్ నిర్వహించిన సమావేశానికి హజరు కావడం విశేషం. ములాయం స్థానంలో అఖిలేష్ ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ఈ నిర్ణయం ములాయం సింగ్ తో పాటు ఆయన వర్గీయులకు తలనొప్పులను తెచ్చిపెట్టింది.

 పార్టీ నిబంధనలకు విరుద్దం

పార్టీ నిబంధనలకు విరుద్దం

ములాయం సింగ్ స్థానంలో అఖిలేష్ యాదవ్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ జాతీయ కార్యవర్గం ఎన్నుకోవడం పార్టీ నియమనిబంధనలకు విరుద్దమని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ములాయం సింగ్ హెచ్చరించారు. అఖిలేష్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి హజరైన నాయకులపై వేటు తప్పదని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు.ములాయం సింగ్ యాదవ్ చీఫ్ మెంటర్ పాత్రను నిర్వహిస్తారని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

 అఖిలేష్ వెంటే పార్టీ నాయకులు

అఖిలేష్ వెంటే పార్టీ నాయకులు

ఆదివారం ఉదయం పూట లక్నోలో నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిలేష్ యాదవ్ వెంటే పార్టీ సీనియర్లంతా నిలిచారు.ములాయం సింగ్ వర్గానికి ఈ సమావేశం ద్వారా అఖిలేష్ తన బలాన్ని మరోసారి నిరూపించారు.పార్టీ సీనియర్ నాయకులతో పాటు అఖిలేష్ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో మెజార్టీ నాయకులు అఖిలేష్ వర్గం వైపుకు రావడంతో ములాయం వర్గానికి మింగుడుపడడం లేదు. ఈవిషయమై అఖిలేష్ వర్గంపై పై చేయి సాధించేందుకు ములాయం వర్గం పావులు కదుపుతోంది.

 సైకిల్ గుర్తున్న పార్టీలకు ఈ కష్టాలు తప్పవా

సైకిల్ గుర్తున్న పార్టీలకు ఈ కష్టాలు తప్పవా

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ టి ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎంఏల్ఏలు చంద్రబాబునాయుడు నాయకత్వంలో తిరుగుబాటుచేసి ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించారు. ఆ తదనంతరం పార్టీపై నెలకొన్న వివాదంలో కూడ చంద్రబాబుకే పార్టీ గుర్తింపు దక్కింది. పార్టీ ఎన్నికల గుర్తు చంద్రబాబు నేతృత్వంలోని పార్టీకే దక్కింది. తదనంతరం ఎన్ టి ఆర్ మరణించాడు. ఆయన సతీమణి లక్ష్మీపార్వతి పార్టీ పెట్టినా ఆశించిన ఫలితాలురాలేదు. ఇక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కూడ సైకిల్. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. కొంతకాలంగా పార్టీలో సంక్షోభం నెలకొంది. పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపుకు అఖిలేష్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు.మరో గ్రూపుకు ములాయం సింగ్ యాదవ్ ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ నేతృత్వం వహిస్తున్నాడు.ములాయం సింగ్ నుండి అఖిలేష్ యాదవ్ పార్టీ జాతీయ పగ్గాలను తీసుకొన్నాడు.ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది.

 ములాయం ఏం చేస్తారు

ములాయం ఏం చేస్తారు

సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని అఖిలేష్ కు కట్టబెడుతూ పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకోవడంతో ములాయం సింగ్ వర్గం ఆత్మరక్షణలో పడింది.అయితే పార్టీ నియమనిబంధనావళికి విరుద్దంగా అఖిలేష్ యాదవ్ వర్గం వ్యవహరిస్తోందని ములాయం సింగ్ వర్గం ఆరోపణలు చేస్తోంది. పార్టీ నిబంధనలు ఎలా ఉన్నాయి. ఈ వ్యవహరంలో అఖిలేష్ వర్గీయులు ఏమైనా తప్పు చేశారా అనే అంశాలను పరిశీలించి దాని ప్రకారంగా న్యాయపరంగా చర్యలను తీసుకొనే అవకాశాలు లేకపోలేదు.మెజారిటీ పార్టీ నాయకులంతా అఖిలేష్ కు మద్దతు పలకడం కూడ ములాయం సింగ్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడ అఖఇలేష్ కు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ములాయం కు ఇబ్బందులను తెచ్చిపెట్టినట్టే కన్పిస్తోంది. అయితే కొడుకుతో ములాయం సింగ్ రాజీకి వస్తారా, లేక ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతారో చూడాలి.

English summary
mulayam warned party leaders , on the leadership of akhilesh yadav conducted samajwadi party national excutive meeting on sunday. this meeting illegal, and warned of strict action against who attend akhilesh conduct meeting said mulayam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X