• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్నీళ్లకే కన్నీళ్లు: విధిని ఎదురించిన వీరవనిత..దబాంగ్ లేడీకి సలాం

|

కొన్ని సార్లు కొన్ని వాస్తవిక కథలు చదివినప్పుడు ఎంతో కొంత మనపై ప్రభావం చూపుతాయి. అలాంటి వాస్తవ గాధే ఓ మహిళ కథ. సాంకేతికంగా భారత్ ప్రపంచదేశాలతో పోటీ పడి దూసుకెళుతున్నప్పటికీ... మహిళ విషయం దగ్గరకొచ్చేసరికి ఎప్పుడూ వెనకంజలోనే ఉంటోంది. ఇందుకు కారణం ఒంటరి మహిళకు సమాజంలో ఆదరణ లేకపోవడమే. ఇలాంటి యాదర్థ గాథే హ్యూమన్స్ ఆఫ్ బాంబే ప్రచురించింది. షిరేన్ అనే మహిళ గాథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కుటుంబ పోషణ కోసం ఆటోరిక్షాను నడుపుతున్న షిరేన్

కుటుంబ పోషణ కోసం ఆటోరిక్షాను నడుపుతున్న షిరేన్

ముంబైకి చెందిన షిరేన్ అనే మహిళ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇందుకు కారణం ఆమె జీవితంలో ఇద్దరు అత్యంత ముఖ్యమైన వ్యక్తులను కోల్పోవడమే. వివాహం జరిగిన తర్వాత ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోవడంతో ఆమె ఒంటరి జీవితలో కష్టాలు మొదలయ్యాయి. అయినప్పటికీ ఆ కష్టాలను చూసి వెనకడుగువేయలేదు. షిరీన్ ధైర్యంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. షిరీన్ చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయింది. తన తల్లి రెండో వివాహం చేసుకోవడంతో సమాజం ఆమెను మాటలతో కొల్లపొడిచింది. దీంతో మనస్తాపానికి గురైన షిరీన్ తల్లి ఒంటికి నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆ తర్వాత తన సోదరిని కోల్పోయింది. ఆ పై తన వివాహం విడాకులకు దారి తీసింది. ఇన్ని కష్టాలు ఒక్కసారిగా వచ్చి పడటంతో షిరీన్ తన జీవితంను తానే తీర్చిదిద్దుకునేందుకు నిర్ణయించుకుంది. అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారికోసమైనా సరే బతకాలని నిర్ణయించుకుని ముంబై వీధుల్లో ఆటో నడపడం మొదలు పెట్టింది.

 చిన్నతనం నుంచే వెక్కిరించిన కష్టాలు

చిన్నతనం నుంచే వెక్కిరించిన కష్టాలు

తను ముస్లిం కుటుంబంలో జన్మించిందని షిరీన్ చెప్పుకొచ్చింది.తను 11 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ప్రతిరోజు గొడవపడేవారని చెప్పింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు చెప్పింది. ఇక తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని.. తన తల్లి కూడా మరో వివాహం చేసుకుందని ఒకరోజు తన సామాజిక వర్గం వారే ఆమె క్యారెక్టర్‌ గురించి నీచంగా మాట్లాడటంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేసుకుంది షిరీన్.తల్లిని కోల్పోవడంతో తాను ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఏడాదిలోను తనకు తన సోదరికి తన తండ్రి పెళ్లి చేశాడని చెప్పింది. అయితే తన ఆడపడచులు కట్నం కోసం వేధించారని చెప్పుకొచ్చిన షిరీన్... తను గర్భవతిగా ఉన్నప్పుడు విష ప్రయోగం కూడా చేశారని చెప్పి భోరున విలపించింది. ఇక తన కొడుకు భూమిపై పడ్డాక వాడి కోసం బతకాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినట్లు చెప్పింది.

 భర్తకు కావాల్సింది శరీర సుఖమే..!

భర్తకు కావాల్సింది శరీర సుఖమే..!

ఇక తన భర్త కూడా తమను పట్టించుకునే వాడు కాదని చెప్పిన షిరీన్.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతనికి కేవలం షిరీన్ శరీరంతోనే అవసరం కానీ కుటుంబంతో కాదు. ఇదే విషయాన్ని షిరీన్ వెల్లడించింది. ఇక తనకు తృప్తి దొరికిన తర్వాత మూడు సార్లు తలాక్ చెప్పేసి తమను వదిలించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది షిరీన్. ఇక ఆసమయంలో ఒంటరిగా ముగ్గురు పిల్లలను వేసుకుని బయటకు వచ్చినట్లు చెప్పిన షిరీన్‌కు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇక పిల్లల భారం తనపై ఉన్నందున ఇక సంపాదన పై పడ్డట్లు చెప్పింది. ముందుగా ఒక చిన్న బిరియాని స్టాల్‌ను తాను పెట్టగా ఆ ఆశ ఎంతో కాలం నిలవలేదని చెప్పింది. బాంబే మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని ఎత్తివేయాల్సిందిగా చెప్పారని చెప్పింది. ఇక తన దగ్గర వచ్చిన డబ్బులను కూడబెట్టుకుని ఒక ఆటో రిక్షాను కొని దాని ద్వారా సంపాదించాలని నిర్ణయించుకుంది. ఇక్కడ కూడా సమాజం తనను వెక్కిరంచిందని గుర్తుచేసుకుంది.

 నాబిడ్డల కోసం బతకాలని నిర్ణయించుకున్నాను

నాబిడ్డల కోసం బతకాలని నిర్ణయించుకున్నాను

ఇక సమాజం ఏమన్నా పట్టించుకోలేదని చెప్పిన షిరీన్... తన బిడ్డల కోసమే తను బతకాలని నిర్ణయించుకుని ఆటో నడుపుతూ సంపాదిస్తున్నట్లు చెప్పింది. తమ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా వారికి కావాల్సినది ఇస్తున్నట్లు చెప్పింది.త్వరలో ఓ కారును కొని వారికి ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పిన షిరీన్ అది త్వరలో జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఒకసారి ఓ వ్యక్తి తన ఆటో రిక్షాను ఎక్కి భయ్యా అని సంబోధించాడట. తీరా చూశాక మీరు దబాంగ్ లేడీ అని చెప్పాడట. ఆ మాటలే ఆమెలో మరింత స్ఫూర్తిని రగల్చాయని గుర్తు చేసుకుంది షిరీన్.

మొత్తానికి మహిళ ఏదైనా సాధించగలదనేందుకు తన కథే ఒక నిదర్శనం అని చెప్పింది షిరీన్. తన తల్లిలా, చెల్లిలా ఎవరూ కష్టాలు పడకూడదని కోరుతోంది. తన ఆటోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు ఇచ్చే కాంప్లిమెంట్స్, తన పిల్లలకోసం తాను చేసే పనిని తన కోసం ఆస్వాదించడం లేదని ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్న ప్రతి మహిళ కోసం ఆస్వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చింది షిరీన్. ఇలాంటి మహిళలు నిశబ్దంలో బాధలను అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sometimes few stories of bravery, grit and hope touch our hearts in a way that they end up leaving a mark on our lives.Such is the story of Shireen, a woman auto-rickshaw driver from Mumbai, whose story has been going viral online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more