వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్టం: 4కిలోల ‘బంగారు చొక్కా’ వేసుకుని తిరిగేశాడు

|
Google Oneindia TeluguNews

This Politician Has 4-Kilo Gold Shirt. Cost? Over a Crore.
ముంబై: ఓ రాజకీయ నాయకుడు తనకున్న సంపదను ఎలాగోలా ప్రదర్శించాలనుకున్నాడో లేక తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడో గానీ.. ఏకంగా ఓ బంగారు చొక్కాను తయారు చేసుకున్నాడు. అంతేగాక ఆ చొక్కాను ధరించి వీధుల్లో తిరిగేశాడు. అతనెవరో ఎమ్మెల్యేనో.. ఎంపీనో.. లేక ఓ రాష్ట్రానికి మంత్రో కాదు.. ఓ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ కావడం గమనార్హం. అతనే శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ పంకజ్ పరాఖ్.

అతను ధరించిన 4 కిలోల బంగారు చొక్కా విలువ అక్షరాల రూ. 1.30 కోట్లు. కాగా, 8వ తరగతిలో చదువు మానేసిన ఈయన, వస్త్ర వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు. ఆ తర్వాత ముంబై నగరానికి 260 కిలో మీటర్ల దూరంలోని యెవోలా కార్పొరేషన్‌లో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అయితే శుక్రవారం తన 45వ పుట్టిన రోజు కావడంతో ప్రత్యేకంగా కనిపించాలనుకున్నాడు. దీంతో తను తయారు చేయించుకున్న బంగారు చొక్కాను వేసుకుని తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

కాగా, అతని పుట్టిన రోజు వేడుకలకు మహారాష్ట్ర పర్యాటక మంత్రి ఛగన్ భుజ్బల్ తోపాటు మరో 12 మంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది. ‘ ఐదేళ్ల నుంచీ నాకు బంగారం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం నాతోపాటే పెరిగింది. అందువల్లే నా 45వ పుట్టిన రోజున ఈ బంగారు చొక్కాను తయారు చేయించుకున్నాను' అని పరాఖ్ చెప్పాడు.

నాసిక్‌లో డిజైన్ చేయించిన ఈ చొక్కాను ముుంబైలోని జువెల్లర్స్ తయారు చేశారని చెప్పాడు. ఈ చొక్కా కోసం 20 మంది నిపుణులు 2 నెలల కాలంపాటు పని చేశారని చెప్పాడు. బంగారు చొక్కాను ధరించి ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయానికి రావడంతో అక్కడున్న వారందరూ అతనివైపే చూశారు. తాను తయారు చేసుకున్న బంగారు చొక్కాకు సంబంధించి పన్ను అధికారుల రిసీట్స్, బ్యాంక్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పాడు. తన పెళ్లి 23ఏళ్లకే అయిందని, ఆ సమయంలో వధువు కంటే ఎక్కువ బంగారం తాను ధరించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాడు.

English summary
For a school dropout, Pankaj Parakh is doing a little better than ok. A sign of his success - a shirt, made of pure gold, that weighs four kilos and costs 1.30 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X