• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Gandhi Jayanti:95 ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్‌లోనే గాంధీజీకి సర్జరీ జరిగిందట..!

|

పూణే: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది. అంతేకాదు మహాత్మాగాంధీ గురించి తెలిసిన వారు, ఆయన ఎక్కడెక్కడ నడియాడారు, ఆయన గురించి ఇతర ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బాపూ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని అద్భుత ఘట్టాలను సోషల్ మీడియాలో రాస్తున్నారు. అయితే అలాంటి ఘటనే 95 ఏళ్ల క్రితం బాపూ జీవితంలో చోటు చేసుకుంది.

యావత్‌జాతికి గాంధీనే స్ఫూర్తి..ఆచరణలో మాత్రం ఎవరికీ వారే పోటీ

 గాంధీజీకి పొత్తికడుపులో నొప్పి

గాంధీజీకి పొత్తికడుపులో నొప్పి

పూణేలోని ఎరవాడా సెంట్రల్ జైలులో ఉన్న మహాత్మాగాంధీ 1924, జనవరి 12న పొత్తి కడుపులో నొప్పి ఉందని తెలిపారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం పూణేలోని ససోన్ హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. వైద్యులు గాంధీజీని పరీక్షించి ఆయన అపెండిక్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ రోజుల్లో అంటే అది చిన్న సర్జరీ చాలా సులభంగా చేసేస్తున్నారు. కానీ 95 ఏళ్ల క్రితం ఆ సర్జరీ చేయాలంటే చాలా క్లిష్టంగా ఉండేది. అప్పటికే కరెంటు కోతలు ఉండేవి. పైగా గాంధీ హాస్పిటల్‌కు వచ్చిన సమయానికి భారీ వర్షం కురిసిందట. దీంతో లాంతరు వెలుగులోనే గాంధీజీకి సర్జరీ చేశారు వైద్యులు.

ఓ చిన్న గదిలో గాంధీజీకి ఆపరేషన్

ఓ చిన్న గదిలో గాంధీజీకి ఆపరేషన్

నాడు 400 చదరపు అడుగులు ఉన్న ఓ ఆపరేషన్ గదిలో గాంధీజీకి సర్జరీ జరిగింది. నేడు దాన్ని ఓ మెమోరియల్‌గా మార్చింది ప్రభుత్వం. అయితే ఇది ప్రజల సందర్శనార్థం అన్ని రోజులు తెరిచి ఉండదు. కొన్ని ప్రత్యేక రోజుల మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ గదిని తెరిచింది ససోన్ హాస్పిటల్. ఏటా అక్టోబర్ 2న ఈ గదివద్ద మహాత్ముడి ఫోటో ఉంచి సిబ్బంది నివాళులు అర్పిస్తారు.

అపెండిసైటిస్ అని నిర్ధారించిన వైద్యులు

అపెండిసైటిస్ అని నిర్ధారించిన వైద్యులు

గాంధీజీ అపెండిసైటిస్‌‌తో తమ హాస్పిటల్‌లో చేరినట్లు హాస్పిటల్ డీన్ డాక్టర్ మురళీధర్ తాంబే చెప్పారు. అప్పుడు గాంధీజీ వయస్సు 50 ఏళ్లని చెప్పారు. ఆ సమయంలో తనకు ఆపరేషన్ నిర్వహించింది డాక్టర్ దలాల్ మరియు డాక్టర్ జీవ్‌రాజ్‌లు అని గాంధీజీ చెప్పినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే అర్థరాత్రికి ముందే ఆపరేషన్ నిర్వహించాలని బ్రిటీష్ సర్జన్ డాక్టర్ కొలోనెల్ మాడ్డాక్ గాంధీజీకి సూచించారు. దీంతో వెంటనే గాంధీజీ సర్వెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా హెడ్ వీఎస్ శ్రీనివాస్ శాస్త్రి మరియు తన ఆప్తమిత్రుడు డాక్టర్ పాథక్‌లను పిలిచినట్లు డీన్ వెల్లడించారు.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు లేఖ

అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు లేఖ

గాంధీజీ ఆపరేషన్ చేయించుకునేందుకు అంగీకరించారంటూ వారితో ఓ లేఖను రాయించారు. ఇప్పటి వరకు డాక్టర్లు తనకు మంచి చికిత్స అందించారని అయితే పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు దిగరాదని ప్రజలను కోరుతూ లేఖ రాయించారు. ఇక అర్థత్రి సమయంలో గాంధీజీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు సర్జరీ జరిగింది. ఆ సమయంలో కరెంటు పోయింది. వెంటనే ఫ్లాష్ లైట్లను వినియోగించారు. అయితే అది కూడా చార్జింగ్ అయిపోవడంతో ఇక లాంతరు వెలుతురులో సర్జరీ పూర్తి చేశారు వైద్యులు.

ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ అదే హాస్పిటల్‌కు గాంధీజీ

ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ అదే హాస్పిటల్‌కు గాంధీజీ

ఆపరేషన్ సక్సెస్ తర్వాత గాంధీ డాక్టర్ మడ్డాక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తనకు విధించిన ఆరేళ్ల కారాగార శిక్షను కుదించడంతో ఫిబ్రవరి 5, 1924లో జైలు నుంచి విడుదలయ్యారు గాంధీ. ఒక ఏడాది తర్వాత తన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ గాంధీజీని అదే ససోన్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ సమయంలో గాంధీజీ దీక్షను బత్తాయి రసం ఇచ్చి విరమింప జేశారు డాక్టర్ మడ్డాక్. ఇలా ఆయన గాంధీజీకి ఎంతో ఆప్తుడిగా తయారయ్యారు.

ఇక గాంధీ సర్జరీకి వినియోగించిన కత్తెర్లు ఇతరత్ర పరికరాలు ఆ గదిలో ఇప్పటికీ అలానే ఉన్నాయి. అంతేకాదు అందులో ఓ లాంతరు కింద జరిగిన సర్జరీ ఘట్టాన్ని తెలుపుతూ ఉన్న ఓ పెయింటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

English summary
As the entire nation pays tribute to Mahatma Gandhi on his 150th birth anniversary, Pune's Sassoon Hospital recalled an emergency surgery carried out under hurricane lamp to save Bapu's life
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X