వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవసీ?: పెళ్లికాని జంటలకు కేవలం 10 గంటలు మాత్రమే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్టార్టప్ కంపెనీలు... నేటి తరం ఔత్సాహిక యువతలో ఓ వినూత్న ఆలోచనకు నాంది పలుకుతున్నాయి. అలాంటి ఆలోచనే ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి వచ్చింది. అతడి పేరు సంచిత్ సేథీ. ఇంతకీ అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే? పెళ్లికాని యువతీ యువకులకు హోటల్లో గదులను ఇప్పించడం.

పెళ్లికాని ప్రేమికులు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడపాలంటే చాలా కష్టం. వాళ్లకు గదులు దొరకవు. ఒకవేళ ఏదైనా హోటల్లో గది తీసుకుందామన్నా పోలీసులతో ఇబ్బందే. ఈ సమస్యను గుర్తించిన బిట్స్ పిలానీ మాజీ విద్యార్థి సంచిత్ సేథి ఓ పరిష్కారం కనుగొన్నాడు. ఈ హోటళ్లలో పెళ్లికాని జంటలు కూడా ఎంచక్కా గడపొచ్చు.

వెబ్‌సైట్‌లో ఉన్న జాబితాలో ఉండే హోటళ్లలో 10 గంటల పాటు గడిపేందుకు అనుమతి ఇస్తారు. నిజానికి పెళ్లికాని యువతీ యువకులకు రూములు ఇవ్వకూడదన్న నిబంధన మన రాజ్యాంగం లేదు. మన చట్టాల ప్రకారం అది శిక్షార్హం కూడా కాదు.

కానీ భారత సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లికాకుండా యువతీ, యువకులు ఒకే రూంలో ఉండటం మన సమాజానికి ఇష్టం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని హోటళ్లలో రూములు ఇచ్చేందుకు మేనేజర్లు సైతం భయపడతారు. అంతేకాదు రూము ఎందుకంటూ అనేక ప్రశ్నలు సంధిస్తారు.

This website helps unmarried Indian couples to get a room

చాలాసార్లు రూము ఇవ్వలేమని కూడా చెబుతారు. ఈ అడ్డంకుల్ని అధిగమించి పెళ్లికాని జంటలకు ఆతిథ్యం ఇచ్చేలా 'స్టే అంకుల్' పేరిట డిసెంబర్ 2015లో సేథీ స్టార్టప్ సంస్థను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ స్టార్టప్ సంస్థ విజయవంతంగా అందరి మన్ననలను అందుకుంటోంది.

తొలుత ఎనిమిది గంటల పాటు హోటల్ రూం కోరుకునే వారికి సాయపడాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆపై, పెళ్లికాని జంటల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఆ దిశగా ఇప్పుడు కసరత్తు పెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, సిమ్లా, బెంగళూరు, పాటియాలా తదితర ప్రదేశాల్లోని వందలాది హోటళ్లతో సేథీ ఒప్పందం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఢిల్లీలో 34, ముంబైలో 10 హోటళ్లను ఈ జాబితాలో పొందుపరిచాడు. అయితే దేశంలోనే పేరుగాంచిన ఓబెరాయ్, ట్రైడంట్ హోటల్స్ సైతం సేథీ ఆఫర్‌కు తలొగ్గడం విశేషం. సాధారణంగా ఈ హోటల్స్ 24 గంటల పాటు అద్దెకిస్తున్న సంగతి తెలిసిందే.

"10 గంటల పాటు గడిపేందుకు రూ. 1200 నుంచి రూ. 5 వేల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ లేదంటే రాత్రి 8 గంటల నుంచి ఉదయం వరకూ రూములు తీసుకోవచ్చు. ప్రీమియం హోటళ్లనే మేము ఎంచుకున్నాం. త్వరలోనే మరిన్ని నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాం" అని సేథీ తెలిపారు.

English summary
Stay Uncle is a Delhi based start-up that was established in December 2015. The website helps unmarried couples book a hotel room for as less as eight hours in reputed and safe hotels where they can be stress free about being shamed or harassed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X