వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#ThisHappened2019.. ట్విట్టర్‌లో మోత మోగించిన మోడీ.. రాహుల్.. టాప్10లో

|
Google Oneindia TeluguNews

Recommended Video

#ThisHappened2019: Top Politics Handles In India - Male || Oneindia Telugu

సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి కాలయాపన లేకుండా సమాచారాన్ని చేరవేయడం అత్యంత సులభంగా మారింది. రాజకీయ నేతలు తమ కార్యకర్తలు, అభిమానులతో అనుసంధానం కావడం.. అలాగే నెటిజన్లు తమ నచ్చిన నేతల గురించి ట్వీట్లు చేయడం ఇటీవల కాలంలో ఊహకు అందని విధంగా మారింది. అయితే 2019లో ట్విట్టర్‌లో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు వీరేనని ట్విట్టర్ ప్రకటన చేసింది. వారు ఎవరంటే..

 మొదటిస్థానంలో నరేంద్రమోదీ

మొదటిస్థానంలో నరేంద్రమోదీ

వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ ఇండియాలో ట్విట్టర్‌లో అత్యంత ఎక్కువగా ప్రభావం చూపిన వ్యక్తిగా మొదటి స్థానంలో నిలిచారు. దేశంలో 370 ఆర్టికల్ రద్దు, భారత, పాక్ సరిహద్దు ప్రాంతంలో వైమానిక దాడులు చేయడం, అలాగే అయోధ్య తదితర అంశాలు ప్రధాని మోదీని వార్తల్లో వ్యక్తిగా మార్చాయి. నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు చేయడానికి అవకాశం ఏర్పడింది.

రెండోస్థానంలో రాహుల్ గాంధీ

రెండోస్థానంలో రాహుల్ గాంధీ

ఇక ట్విట్టర్‌లో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తుల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండోస్థానంలో నిలిచారు. చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలతో పరువు నష్టం దావాను ఎదుర్కొని కోర్టు మొట్టికాయలతో సరిపెట్టుకొన్నారు. అలాగే తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలిలో ఓటమి పాలు కావడం లాంటి అంశాలు కూడా రాహుల్‌ గురించి మాట్లాడుకొనేలా చేశాయి.

మూడోస్థానంలో అమిత్ షా

మూడోస్థానంలో అమిత్ షా

ఇక ట్విట్టర్‌లో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తుల్లో మూడోస్థానంలో అమిత్ షా నిలిచారు. జమ్ము, కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, పౌరసత్వ సవరణ బిల్లు లాంటి అంశాల విషయంలో అమిత్ షా అనుసరించిన విధానాలు ట్విట్టర్‌లో నెటిజన్లు మాట్లాడుకునేలా చేశాయి.

టాప్ 10లో వీరే

ట్విట్టర్‌లో మోస్ట్ ట్వీటెడ్ పర్సనాలిటీలలో నాలుగో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, ఐదో స్థానంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆరో స్థానంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఏడోస్థానంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎనిమిదో స్థానంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, 9వ స్థానంలో క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్, 10వ స్థానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు.

English summary
Most tweeted politician Narendra Modi, Most tweeted politician Rahul Gandhi, Most tweeted politician Amit Shah, Twitter data about Indian politicians, Twitter data about Narendra Modi, Twitter data about Rahul Gandhi, Twitter data about Amith Shah, Most tweeted politician Narendra Modi,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X