వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ నాయకులను చంపేయాలి: జడ్జి సంచలనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యయమూర్తి ఎస్ఎన్ దింగ్రా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కేసులో ఉరిశిక్ష పడిన అప్జల్ గురుకు మద్దతు పలికే రాజకీయ నాయకులను చంపేయాలని అన్నారు.

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ) గొడవల నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2002లో పార్లమెంటుపై దాడికి పాల్పడి 15 మంది మృతికి కారణమైన వ్యక్తి బలిదానం చేశాడంటూ సంతాప వ్యక్తం చేయడం సరైన పనా..? అంటూ ప్రశ్నించారు.

అప్జల్ గురుకి ఉరిశిక్ష విధించడం ‘జ్యుడిషియల్‌ క్లిలింగ్‌' అంటూ వ్యాఖ్యానించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సమాజానికి హితం చేసే వ్యక్తులను శిక్షించే హక్కు న్యాయస్థానాలకు ఎప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చట్టాన్ని ప్రశ్నించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదని అన్నారు.

 'Those Backing Afzal Guru Could Have Been Killed' - Parliament Attack Case Judge

అఫ్జల్‌గురుని ఉరితీసిన రోజును సంతాపం దినంగా వ్యవహరిస్తూ జెఎన్‌యూలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించడాన్ని తీవ్రంగా స్పందించారు. జెఎన్‌యూ విద్యార్ధులకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను కూడా వదలకూడదని దింగ్రా అభిప్రాయపడ్డారు.

జెఎన్‌యూలో అప్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారని, దీంతో జెఎన్‌యూలోని ఏడుగురు విద్యార్ధులపై దేశద్రోహం నేరం కింద ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న కన్నయ్య కుమార్‌ను అరెస్ట్ చేసి ఢిల్లీ హైకోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

ఇటీవల కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు పార్లమెంటుపైదాడి కేసులో ఉగ్రవాది అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష విధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పీ చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అఫ్జల్‌గురుకు మరణశిక్షపై కోర్టు తీసుకున్న నిర్ణయం సరైని కాదని అన్నారు. పార్లమెంటుపై దాడిలో అఫ్జల్‌గురు ప్రమేయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. జేఎన్‌యూ విద్యార్థులపై దేశద్రేహం అభియోగాలుమోపడం దారుణమని కూడా అన్నారు.

English summary
The judge who sentenced Parliament attack convict Afzal Guru to death has hit out at opposition members for backing students who allegedly participated in an event at the Jawaharlal Nehru University (JNU) in his support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X