వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గుర్మిర్ కౌర్ కు మద్దతిచ్చే వారంతా పాకిస్తాన్ కు అనుకూలమే, మంత్రి సంచలన వ్యాఖ్యలు'

కార్గిల్ యుద్దంలో మరణించిన కెప్టెన్ మణిదీప్ కుమార్తై గుర్మిర్ కౌర్ చేస్తోన్న ప్రచారాన్ని సమర్థిస్తున్న వారంతా పాకిస్తాన్ కు అనుకూలవాదులేనని హర్యానా మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీఘడ్:కార్గిల్ యుద్దంలో మరణించిన కెప్టెన్ మణిదీప్ కుమార్తై గుర్మిర్ కౌర్ చేస్తోన్న ప్రచారాన్ని సమర్థిస్తున్న వారంతా పాకిస్తాన్ కు అనుకూల వాదులేనని హర్యానా మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే గుర్మిర్ కౌర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారో వారిని దేశం నుండి బయటకు పంపాలని ఆయన కోరారు.

ఢిల్లీలోని రాంజాస్ కాలేజీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కార్గిల్ యుద్దంలో మరణించిన కెప్టెన్ మణిదీప్ కుమార్తై గుర్మిర్ కౌర్ ఎబివిపికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించింది.అయితే ఈ ప్రచారం చేసిన గుర్మిర్ కౌర్ పై బెదిరింపులకు దిగారు.ఈ విషయాన్ని కూడ ఆమె సోషల్ మీడియాలో పోస్టుచేసింది.

Those supporting Gurmehar pro-Pak, should be thrown out: BJP minister

గుర్మిర్ కౌర్ కు వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలోనే గుర్మిర్ కౌర్ తీరును హర్యానా రాష్ట్రానికి చెందిన బిజెపికి చెందిన మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.గుర్మిర్ కౌర్ కు ఎవరు మద్దతుగా నిలుస్తున్నారో వారంతా కూడ పాకిస్తాన్ కు అనుకూల వాదులేనని ఆయన చెప్పారు. వారందరికీ దేశంలో నివసించే హక్కులేదన్నారాయన.గుర్మిర్ కౌర్ ప్రచారానికి మద్దతుగా నిలిచినవారందరికీ దేశం నుండి బయటకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలకు అనిల్ విజ్ కేంద్రం

గత మాసంలో కూడ మంత్రి అనిల్ విజ్ ఇదే తరహలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది. దీంతో అనిల్ విజ్ ఎట్టకేలకు గాంధీజీ పై తాను చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకొన్నారు.

English summary
Haryana’s outspoken Minister Anil Vij on Wednesday said those who are supporting Delhi University student Gurmehar Kaur for her campaign against the ABVP, were pro-Pakistan and should be thrown out of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X