వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేజస్వి పరువు తీసిన నితీశ్... కేబినెట్ మీటింగే సరిగా నిర్వహించలేరు... ఇక ఉద్యోగాలా...?

|
Google Oneindia TeluguNews

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమిలో మిత్ర పక్షాలుగా పోటీ చేసిన ఆర్జేడీ,జేడీయూ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బద్ద శత్రువులుగా బరిలో దిగుతున్నాయి. అప్పటి సంకీర్ణ సర్కార్ విచ్చిన్నానికి నితీషే కారణమని భావిస్తున్న ఆర్జేడీ... అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఎన్నికల బరిలో దిగుతోంది. ఇటు నితీశ్ కూడా ఆర్జేడీ నేత్రుత్వంలోని మహాకూటమిని ఓడించి తీరాలన్న పట్టుదలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజా ఎన్నికల ప్రచారంలో మహాకూటమి సీఎం అభ్యర్థి,ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తేజస్వికి నితీశ్ చురకలు...

తేజస్వికి నితీశ్ చురకలు...

'అధికారంలో ఉన్నప్పుడు కనీసం కేబినెట్ మీటింగ్ కూడా సరిగా నిర్వహించలేనివాళ్లు... ఇప్పుడు అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలిస్తామని హామీలు ఇస్తున్నారు...' అని తేజస్వి యాదవ్‌‌పై నితీశ్ విమర్శలు గుప్పించారు. 'ఏం చెప్తున్నారు వాళ్లు... అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్‌ మీటింగ్‌లో 10లక్షల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తామంటున్నారు. కానీ వాళ్ల హయాంలో కనీసం కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించలేదు..' అన్నారు. అంతేకాదు,ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించగలదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పతీ పత్నీ రాజ్...

పతీ పత్నీ రాజ్...

'ఫేక్ హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 15 ఏళ్లు(1995-2005) వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలిచ్చారో లెక్క చెప్పాలి. అలాగే 2005 నుంచి ఇప్పటివరకూ మేమెన్ని ఉద్యోగాలిచ్చామో లెక్క చెప్తాం. తేజస్వి యాదవ్‌ లాంటి వ్యక్తులకు పాలనా అనుభవం లేదు... ప్రజల కోసం పనిచేయాలన్న చిత్తశుద్ది కూడా లేదు... నావరకు బిహార్ మొత్తం నా కుటుంబం లాంటిది. కానీ వాళ్లకు,వారి కుటుంబమే ప్రధానం.' అని నితీశ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ ఎన్నికలు 'పతీ పత్నీ రాజ్'కి,మంచి పాలన అందించే వ్యక్తులకు మధ్య పోటీ అన్నారు. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన మొదటి ఎన్నికల క్యాంపెయిన్ నుంచి ఇప్పటివరకూ ప్రతీ ప్రచారంలో నితీశ్ 'పతీ పత్నీ రాజ్'ను హైలైట్ చేస్తూ ఆర్జేడీని టార్గెట్ చేస్తున్నారు.

జేడీయూతోనే అభివృద్ది...

కీలకంగా మారిన నిరుద్యోగ అంశం...

కీలకంగా మారిన నిరుద్యోగ అంశం...

ఓవైపు కరోనా వ్యాప్తి.. మరోవైపు వరదల బీభత్సంతో ఈ ఏడాది బిహార్ పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో తేజస్వి యాదవ్ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే మొట్టమొదట తీసుకోబోయే నిర్ణయం 10లక్షల ఉద్యోగాల కల్పన అని చెబుతున్నారు. నితీశ్ పాలనలో బిహార్‌లో నిరుద్యోగ రేటు 46.6శాతానికి చేరుకుందని.. ఇది దేశంలోనే అత్యధికమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ కూడా ప్రచార ర్యాలీల్లో నిరుద్యోగ సమస్యను విస్మరించలేని అనివార్యత ఏర్పడింది.

English summary
Making light of RJD leader Tejashwi Yadav's promise to provide 10 lakh jobs if elected to power, Bihar Chief Minister Nitish Kumar on Monday said those who could not even hold a cabinet meeting properly during their reign are today talking about sanctioning lakhs of government jobs at the very first cabinet meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X