వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీరాముని దర్శనం చేసుకోని వారికి భక్తులు ఓట్లు వేయరు: స్మృతీ ఇరానీ

|
Google Oneindia TeluguNews

బదౌన్ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రియాంకా గాంధీని తన మాటలతో అటాక్ చేశారు. అయోధ్య వరకు వెళ్లి శ్రీరాముని ఆశీస్సులు తీసుకోకుంటే వారికి రామభక్తుల ఓట్లు పడవని అన్నారు. అయోధ్యలో పర్యటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అక్కడ ప్రసిద్ది గాంచిన హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అయితే వివాదాస్పద బాబ్రీ మసీదు రామజన్మభూమిలో ఉన్న శ్రీరాముని ఆలయాన్ని సందర్శించలేదు. దీనిపై మండిపడ్డారు స్మృతీ ఇరానీ. వీరి రాజకీయాలు ఇలానే ఉంటాయని విమర్శించారు.

మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రే మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రే

ప్రియాంకా గాంధీ రెండురోజుల క్రితం ఆమె రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీ, తల్లి సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించారు. ఆ తర్వాత ఆమె అయోధ్యలో పర్యటించారు. అయోధ్యలో శ్రీరాముల వారి ఆలయంను సందర్శిస్తారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ అది తన షెడ్యూలులో లేదని చెప్పారు. ఇక తాను పోటీ చేయాల్సి వస్తే వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేస్తానని ప్రియాంకాగాంధీ కార్యకర్తలతో చెప్పారు.

Those who didnt bow before Ram Lalla wont get Ram bhakts votes: Smriti Irani

ఇక ప్రియాంకా పర్యటనపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విరుచుకుపడ్డారు. పోలింగ్ రోజన రాముని భక్తులు పోలింగ్ స్టేషన్‌కు వెళతారు కానీ కాంగ్రెస్‌కు కాకుండా బీజేపీకి ఓటు వేస్తారని ఆమె జోస్యం చెప్పారు. అంతేకాదు ప్రియాంకాగాంధీ గంగా నదిలో పడవలో ప్రయాణించిన దానిపై కూడా విమర్శలు సంధించారు స్మృతీ ఇరానీ. వీరంతా విదేశాలకు విమానాల్లో వెళ్లే వారని... ఇప్పుడు ఎన్నికలు కాబట్టి గంగానది దర్శనాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

English summary
Union minister Smriti Irani said Saturday those who do not have the courage to bow before Ram Lalla in Ayodhya would not be able get the votes of the devout followers of Lord Ram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X