వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సావర్కర్‌ను వ్యతిరేకించే వారు అక్కడ సమయం గడపాలి: సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Those who oppose Savarkar must be jailed in Andaman Cellular Jail for 2 days- Sanjay Raut

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొత్త వివాదంకు తెరదీశారు. వీడీ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వడాన్ని ఎవరైన వ్యతిరేకిస్తే అట్టివారు అండమాన్ నికోబార్ జైలులో కొన్ని రోజులు గడపాలని సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేశారు. ఇక సంజయ్ రౌత్ వ్యాఖ్యలతో రెండు మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆ పార్టీనేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎంపీ సంజయ్ రౌత్ పై విధంగా స్పందించారు.

సావర్కర్‌కు భారత రత్న అవార్డును వ్యతిరేకిస్తున్నవారు అండమాన్ జైలులో కొంత కాలం గడిపితే నాడు సావర్కర్ అనుభవించిన బాధ ఆవేదన తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు సంజయ్ రౌత్. సావర్కర్ 14 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. సావర్కర్ ఎలాంటి కష్టాలు అయితే అక్కడ అనుభవించారో అలాంటి కష్టాలు ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు అనుభవిస్తేనే తెలుస్తుందన్నారు రౌత్. అయితే ఈ వ్యాఖ్యలు సంజయ్ రౌత్ వ్యక్తిగతమైనవని, పార్టీతో సంబంధం లేదని మంత్రి ఆదిత్య థాక్రే స్పష్టం చేశారు.

Those who oppose Savarkar should spend some time in Andaman Jail:Sanjay Raut

శివసేన కాంగ్రెస్ పార్టీల కూటమి చాలా బలంగా ఉందని మహారాష్ట్ర అభివృద్ధి కోసమే రెండు పార్టీలు ఒక్కటయ్యాయని చెప్పారు ఆదిత్య థాక్రే. కొన్ని అంశాలపైన వేర్వేరు అభిప్రాయలున్న మాట వాస్తవమే అని ఇలాంటివి ప్రజాస్వామ్యంలో సహజమన్నారు. చరిత్ర తవ్వుకునే బదులు ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల పై మాట్లాడుకుంటే ఇద్దరికీ మంచిదని ఆదిత్య థాక్రే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ హిందుత్వ భావజాలంపై మాట్లాడటంతో వీర్‌సావర్కర్ అంశం శివసేన తెరపైకి తీసుకొచ్చింది.

గత డిసెంబర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ రేపిన్ ఇండియా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ రావడంతో తాను రాహుల్ గాంధీ అని తనపేరు రాహుల్ సావర్కర్ కాదని అన్నారు. అందుకే క్షమాపణ చెప్పనని చెప్పడంతో సావర్కర్ పేరుతీసి , సంజయ్ రౌత్‌ను అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ఎన్సీపీలతో శివసేన జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అక్కడ రాజకీయంగా కొన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. గత వారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై రౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడిన విషయం తెలిసిందే.

English summary
Senior Shiv Sena leader Sanjay Raut has suggested those opposing the Bharat Ratna for VD Savarkar should spend some time in the Cellular Jail in Andaman and Nicobar, in what could be seen as a veiled jibe at the Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X