వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"4 గురు పెళ్ళాలు, 40 మంది పిల్లలు.. మరి జనాభా పెరగదా?"

ప్రధాని మోడీ చీవాట్లు పెట్టడంతో కొంతకాలం మౌనముద్ర దాల్చిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మళ్ళీ తాజాగా నోరుపారేసుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి..' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, ప్రధాని మోడీ చీవాట్లు పెట్టడంతో కొంతకాలం మౌనముద్ర దాల్చిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మళ్ళీ తాజాగా నోరుపారేసుకున్నారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగి రాజకీయ సందడి నెలకొన్న తరుణంలో ఆయన మళ్ళీ తన నోటికి పని చెప్పారు. శనివారం మీరట్ లోని ఓ దేవాలయ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ ఒక వర్గం వారిని టార్గెట్ చేశారు.

గతంలో తానూ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ... అప్పట్లో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ మొదలుపెట్టిన ఆయన.. దేశంలో జనాభా పెరిగిపోవడానికి కారణం హిందువులు కాదన్నారు.

Those with 4 wives behind population rise: Sakshi Maharaj

హిందూ మహిళలు పిల్లల్ని కనే యంత్రాలు కాదని, ఒక వర్గానికి చెందిన వారు నలుగురిని పెళ్లి చేసుకుని, నలభై మంది పిల్లల్ని కంటూపోవడమే భారతీయ జనాభా విపరీతంగా పెరగడానికి కారణమన్నారు.

తన కుటుంబాన్నే ఉదాహరణగా తీసుకోమంటూ... "మేం నలుగురు అన్నదమ్ములం. అందరం సన్యాసం స్వీకరించాం. జనాభా పెరగకుండా మా వంతు కృషి మేం చేస్తున్నాం. ప్రభుత్వాలు మెచ్చి మాకు బహుమతి ఇవ్వాలి.." అని వ్యాఖానించారు.

,మరోవైపు కొందరు తలాక్ తీసుకోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం సాగిస్తున్నారని, ఇదొక తంతుగా మారిందని, ఇకపై ఇలాంటి పద్ధతిని సహించమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అంతలోనే ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న విషయం గ్రహించిన ఆయన మాట మార్చేందుకు ప్రయత్నించారు.

"ఇది కోడ్ ఉల్లంఘనే.."

అయితే అప్పటికే జరగాల్సిన రాద్దాంతం జరగనే జరిగిపోయింది. బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయని, ఆయనపై సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని జేడీ-యూ నేత కె.సి.త్యాగి డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాజకీయ నాయకులెవరూ తమ ఉపన్యాసాలలో కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడగరాదన్నారు.

ముస్లింలను ఉద్దేశించి సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ.. అవి సాక్షి మహారాజ్ వ్యక్తిగత వ్యాఖ్యలుగానే పరిగణించాలే తప్ప వాటితో బీజేపీకి ఎలాంటి సంబధం లేదన్నారు.

మరోవైపు సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడింది. ఆ పార్టీ నాయకుడు కె.సి.మిట్టల్ మాట్లాడుతూ సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయని, ఈ విషయాన్ని తాము సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఆయన పై చర్య తీసుకోవలసిందిగా కోరతామని చెప్పారు.

English summary
Two days after the poll dates were announced in Uttar Pradesh, BJP MP and religious leader Sakshi Maharaj on Saturday triggered a fresh row by insinuating that the Muslim community was responsible for the population boom in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X