వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుట్టూ కరోనా వైరస్: ఎనిమిది లక్షలమందికి పైగా భక్తులు ఒకేచోట: పుణ్యస్నానాలతో కిటకిట

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. మాస్కులను ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి కనీస నిబంధనలను తప్పనిసరిగా పాటించి తీరాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సినిమా థియేటర్లలో సీటింగ్ కెపాసిటీపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. శుభకార్యాలకు హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యపైనా పరిమితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కుంభమేళా 2021 ప్రారంభమైంది.

Recommended Video

#KumbhMela2021: చుట్టూ కరోనా వైరస్: లక్షలమంది భక్తులు ఒకేచోట, పుణ్యస్నానాలతో కిటకిట| Oneindia Telugu

కాస్సేపట్లో వ్యాక్సినేషన్: వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే: వారంలో ఎన్ని రోజులు వ్యాక్సిన్?కాస్సేపట్లో వ్యాక్సినేషన్: వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే: వారంలో ఎన్ని రోజులు వ్యాక్సిన్?

దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో లక్షలాదమంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. భక్తి ప్రపత్తులతో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని 14వ తేదీన ప్రారంభమైన కుంభమేళా..ఏప్రిల్ 27వ తేదీ వరకు కొనసాగుతుంది. ఛైత్రమాసం పౌర్ణమితో ముగుస్తుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి, సోమావతి అమవాస్య, బైసాఖీ, శ్రీరామ నవమి, చైత్ర పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.

Thousands gather in Haridwar for Kumbh Mela 2021, flouting Covid-19 norms

ఈ నాలుగు నెలల వ్యవధిలో కనీసం అయిదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. అదెలా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ.. దాన్ని ఎవరూ పాటించట్లేదనేది సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోన్న వీడియోలను బట్టి చూస్తే తెలిసిపోతోంది.

English summary
Thousands of devotees and pilgrims have descended on the banks of the Ganges river trusting in faith rather than masks to shield them against the coronavirus pandemic during the giant Kumbh Mela 2021 festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X