వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసంద్రాన్ని తలపించిన బాంద్రా రైల్వే స్టేషన్: సొంతూరు చేరేందుకు బీహారీ కూలీల పాట్లు

|
Google Oneindia TeluguNews

ముంబై: వలస కూలీలను తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను, రాష్ట్రాలు బస్సులను నడుపుతున్నప్పటికీ వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కూలీలు.. తమ సొంత రాష్ట్రం వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

తాజాగా, మహారాష్ట్రలో ఉంటున్న బీహారీ వలస కూలీలు పెద్ద సంఖ్యలు ముంబై బంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కాగా, రిజిస్టర్ చేసుకున్నవారిని శ్రామిక్ రైళ్లలో తమ గమ్యస్థానాలను పంపించగా.. ఇతరులు స్టేషన్ వద్దే నిలిచిపోవాల్సి వచ్చింది. అయితే, తమను కూడా తమ సొంత రాష్ట్రానికి పంపాలంటూ వలస కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

thousands of Bihar Migrants Outside Mumbais Bandra Station

వేలాది సంఖ్యలో తరలివచ్చిన వలస కార్మికులను పోలీసులు తిరిగి పంపించారు.
దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముంబైలో వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు ఇప్పటికే తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. ముంబైలో బీహార్ నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారు విడతల వారీగా తమ రాష్ట్రానికి చేరుకుంటున్నారు. మంగళవారం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో బాంద్రా రైల్వే స్టేషన్ చేరుకోవడం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మహారాష్ట్రలోని సుమారు 5 లక్షల మందికిపైగా వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు ఇప్పటికే బస్సులు, రైళ్ల ద్వారా చేరుకున్నారని సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. మరికొంత మంది రాష్ట్రంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో 50వేల పరిశ్రమలను తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం కోరారు.

రాష్ట్రంలోని వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం ఉద్ధవ్ తెలిపారు. 6.5 లక్షల మందికి తాము మూడు పూటల భోజనం పెడుతున్నామని చెప్పారు. మరికొంత మంది తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Recommended Video

Sonu Sood Arranges Buses For Migrants Stuck In Mumbai

ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ దగ్గర కూడా వేలాది మంది వలస కూలీలు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు వేచిచూస్తున్నారు. మంగళవారం బాంద్రా రైల్వే స్టేషన్ కు వచ్చిన వేలాది మంది కూలీలు సామాజిక దూరం పాటించకపోవడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే ముంబైలో 20వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకే ప్రయత్నిస్తోంది.

English summary
Thousands of migrant labourers bound for Bihar gathered outside Mumbai's Bandra Terminus today, hoping to catch a special train to the state. But most of them were sent back by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X