వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుట్టలకొద్దీ కండోమ్ ప్యాకెట్లు.. చూసిన జనం షాక్.. అక్కడొద్దని ఆందోళన..

|
Google Oneindia TeluguNews

ఐదో పదో కాదు.. ఏకంగా రెండు లారీల నిండా వచ్చిపడ్డ కండోమ్ ప్యాకెట్లను చూసి జనం షాక్ తిన్నారు. వాటిని వెంటనే అక్కణ్నుంచి తీసుకెళ్లాలని గొడవపడ్డారు. వినకపోతే ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గుట్టుగా చేద్దామనుకున్న పనికాస్తా రచ్చకెక్కడంతో అధికారులు తలలుపట్టుకోవాల్సివచ్చింది. వివరాల్లోకి వెళితే..

 thousands of outdated Condom packet found In Unnao

తరచూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఇటీవల కండోమ్ ల వ్యవహారం కలకంల రేపింది. పట్టణ శివారులోని సోహరామావ్ లో ఓ మూసేసిన ఇటుకబట్టీ దగ్గర కండోమ్ ప్యాకెట్ల లోడ్ దిగడాన్ని స్థానికులు గుర్తించారు. దగ్గరకెళ్లి ఆరాతీయగా.. వాటిని తగులబెట్టడానికి తీసుకొచ్చినట్లు లారీ డ్రైవర్లు చెప్పారు. అంత పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్లను తగులబెడితే కాలుష్యం వెలువడుతుందంటూ స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై స్థానికులు, లారీడ్రైవర్ల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదువెళ్లింది.

 thousands of outdated Condom packet found In Unnao

అన్ని కండోమ్ లు ఎక్కడివి?
ఇటుకబట్టీలో తగులబెట్టడానికి తీసుకొచ్చిన కండోమ్ ప్యాకెట్లు ఎక్కడివనేదానిపై పోలీసులు ఆరాతీయగా.. లక్నో ప్రభుత్వాసుపత్రికి చెందినవని తేలింది. ప్రజలకు ఉచితంగా పంచడం కోసం ఏటా కొన్ని లక్షల కండోమ్ ప్యాకెట్లను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. అలా లక్నో ఆస్పత్రికి కూడా నాలుగైదు లారీల కండోమ్ లు వచ్చాయి. అయితే ఉచిత పంపిణీ సరిగా జరక్కపోవడంతో చాలావరకు గౌడన్ లోనే మిగిలిపోయాయి. అవికాస్త గడువు తీరడంతో వీటిని తీసుకునేందుకు మున్సిపాలిటీ వాళ్లు నిరాకరించారు. ఇక చేసేదేమీలేక వాటిని నిర్మానుష్య ప్రదేశంలో కాల్చేయాలని అధికారులు భావించారు. కానీ స్థానికులు అడ్డుకోవడంతో విషయం రచ్చకెక్కింది.

English summary
Government authorities in Uttar Pradesh tries to burn thousands of Expired condom packets in unnao, locals objects
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X