బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాఫియా డాన్ పేరుతో బిల్డర్ కు బెదిరింపులు, సెంట్రల్ జైల్లో స్కెచ్, సినిమా ఫక్కీలో!

|
Google Oneindia TeluguNews

ఉడిపి/బెంగళూరు: బెంగళూరు సెంట్రల్ జైల్లో మాకాం వేసి తన అనుచరులతో మాఫియా డాన్ పేరుతో ప్రముఖ బిల్డర్ ను బెదిరించి రూ. 25 లక్షలు వసూలు చెయ్యడానికి ప్రయత్నించాడు. ఈ కేసులో చివరికి ఇద్దరు నిందితులను కర్ణాటకలోని ఉడిపి పోలీసులు అరెస్టు చేశారు. నగదు ఇస్తామని నమ్మించి బీచ్ కు పిలిపించి సినిమా ఫక్కీలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు సెంట్రల్ జైలు

బెంగళూరు సెంట్రల్ జైలు

ఉడిపికి చెందిన ధను యానే ధనరాజ్, ఉల్లాస్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని మంగళవారం పోలీసులు తెలిపారు. మంగళూరులోని తోకొట్టు ప్రాంతంలో జరిగిన ఓ హత్య కేసులో పేరుమోసిన రౌడీషీటర్ విక్కీ పూజారి అరెస్టు అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

క్లాసిక్ బిల్డర్ కు ఫోన్

క్లాసిక్ బిల్డర్ కు ఫోన్

విక్కీ పూజారితో ధను, ఉల్లాస్ కు సంబంధాలు ఉన్నాయి. వారం రోజుల క్రితం ధను, ఉల్లాస్ క్లాసిక్ బిల్డర్స్ యజమాని ప్రభాకర్ పూజారికి ఫోన్ చేశారు. మాఫియా డాన్ బన్నంజే రాజ మాట్లాడుతున్నానని, వెంటనే రూ. 25 లక్షలు మామూళ్లు ఇవ్వాలని సూచించారు.

డబ్బు ఇవ్వకుంటే చంపేస్తాం

డబ్బు ఇవ్వకుంటే చంపేస్తాం

రూ. 25 లక్షలు ఇవ్వకుంటే తన మనుషులతో నిన్ను హత్య చేయిస్తానని క్లాసిక్ బిల్డర్స్ యజమాని ప్రభాకర్ పూజారిని బెదిరించారు. వారం రోజుల నుంచి ప్రతిరోజూ ప్రభాకర్ పూజారికి నిందితులు ఫోన్ చేసి రూ. 25 లక్షలు ఇవ్వాలని వేధించారు.

బీచ్ లో రూ. 25 లక్షలు

బీచ్ లో రూ. 25 లక్షలు

క్లాసిక్ బిల్డర్స్ యజమాని ప్రభాకర్ పూజారి ఉడిపి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచనమేరకు క్లాసిక్ బిల్డర్స్ యజమాని ప్రభాకర్ పూజారి ధను కు ఫోన్ చేసి ఉడిపిలోని మల్టే బీచ్ దగ్గరకు రావాలని, రూ. 25 లక్షలు ఇస్తానని చెప్పాడు.

సినిమా ఫక్కీలో అరెస్టు

సినిమా ఫక్కీలో అరెస్టు

సోమవారం రాత్రి మల్టే బీచ్ దగ్గరకు కారులో ధను, ఉల్లాస్ వెళ్లారు. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసిన ధను, ఉల్లాస్ పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు సినిమా ఫక్కీలో వెంటాడి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఇంతకు ముందే ధను, ఉల్లాస్ మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యిందని, బెంగళూరు జైలులో ఉన్న విక్కీ పూజారి సూచన మేరకు బిల్డర్ ప్రభాకర్ పూజారిని బెదిరించారని పోలీసులు తెలిపారు.

English summary
From one week threat call came to udupi Businessman in the name of Bannanje Raja. Vicky Poojary's associates have been arrested cinematically in this context.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X