వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత కల్పించండి : ఊర్మిళ

|
Google Oneindia TeluguNews

ముంబై : ఇటీవల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవతో తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందన్నారు కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి ఊర్మిళ. ఆమె ఉత్తర ముంబై నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభ స్థానానికి పోటీచేస్తున్నారు. ఇటీవల బోరివలిలో ప్రచారం చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు మోదీ అని నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ జరిగి బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే.

భద్రత కల్పించండి : ఊర్మిళ
దీంతో తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని ఊర్మిళ పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించాలని కోరారు. ఇటీవల జరిగిన గొడవ దృష్ట్యా ఊర్మిళకు భద్రత కల్పించేందుకు పోలీసులు అంగీకరించారు. ఎన్నికలు ముగిసేవరకు ఆమెకు భద్రతా కల్పిస్తామని ముంబై పోలీసులు స్పష్టంచేశారు.

Threat to My Life, Have Filed Police Complaint : Urmila Matondkar After Clash Between Cong-BJP Workers

హింసకు తావులేదు
ఎన్నికల్లో ప్రచారం చేస్తే .. హింసాత్మక ఘటనకలకు పాల్పడటం ఏంటని ఊర్మిళ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ర్యాలీలో సాధారణ ప్రజలు లేరని .. వారిలో చాలా మంది బీజేపీ కార్యకర్తలేననని ఆరోపించారు. ఈ క్రమంలో తనకు భద్రత కల్పిచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు వారిలో కొందరు మహిళలు అసభ్యపదజాలంలో దూషించారని .. వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టంచేశారు. ఈ నెల 29న నాలుగో విడత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఊర్మిళ బరిలో ఉన్నారు.

English summary
Actor-turned-politician Urmila Matondkar on Monday approached police for protection after a clash between Congress and BJP supporters during her poll campaign in north Mumbai. The scuffle took place near Borivali station where Matondkar, Congress candidate from Mumbai North Lok Sabha constituency, was campaigning, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X