వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ, దోవల్ సెక్యూరిటీ డేటా చోరి? - ఎన్ఐసీ కంప్యూటర్లపై సైబర్ దాడి - దర్యాప్తులో సంచలన అంశాలు

|
Google Oneindia TeluguNews

భారత రాష్ట్రపతి మొదలుకొని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల కీలక నేతలు, భిన్నరంగాలకు చెందిన ప్రముఖులు, ఆఖరికి బడా క్రిమినల్స్ సహా దాదాపు 10వేల మందిపై చైనా ఐటీ సంస్థలు గూఢచర్యానికి పాల్పడుతోందంటూ నాలుగు రోజుల కిందట వెల్లడైన సమాచారం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా అంతకంటే ప్రమాదకరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) కంప్యూటర్లను హ్యాక్ చేసి, కీలకమైన డేటాను దొంగిలించినట్లు వెల్లడైంది.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూల్చివేత - మున్సిపల్ అధికారుల డేరింగ్ స్టెప్ - మంత్రి ఆదేశంతో దూకుడుఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూల్చివేత - మున్సిపల్ అధికారుల డేరింగ్ స్టెప్ - మంత్రి ఆదేశంతో దూకుడు

ఢిల్లీ పోలీసుల దర్యాప్తు..

ఢిల్లీ పోలీసుల దర్యాప్తు..

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు.. ఈనెల మొదటి వారంలో సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసుకుని, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారానికి సంబందించి ఢిల్లీ పోలీసు విభాగం అధికారులు చెప్పనట్లుగా శుక్రవారం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం.. జరిగింది మామూలు నేరం కాదని, జాతీయ భద్రతకు ముప్పు తలపెట్టే వ్యవహారమని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..

 డిజిటల్ ఇండియా గుండెకాయ ఎన్ఐసీ

డిజిటల్ ఇండియా గుండెకాయ ఎన్ఐసీ

ప్రభుత్వాలకు చెందిన దాదాపు అన్ని అంశాలూ డిజిటలైజ్ అవుతుండటం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నదే. దేశాన్ని ‘డిజిటల్ ఇండియా'గా అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వాలకు ఐటీ సేవలు అందించేందుకు ఏర్పాటైందే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ). భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సహా ప్రముఖుల సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతోపాటు దేశ భద్రతకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని ఎన్ఐసీ నిర్వహిస్తుంటుంది. తాజాగా హ్యాకర్లు దాడి చేసింది ఈ ఎన్ఐసీ కంప్యూటర్లపైనే. సంస్థ ఢిల్లీ ఆఫీసులోని 100కుపైగా కంప్యూటర్లలో మాల్ వేర్ ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.

కీలక సమయంలో మోదీకి జగన్ అండ - వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు - బీజేపీ మిత్రులే షాకిచ్చిన వేళకీలక సమయంలో మోదీకి జగన్ అండ - వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు - బీజేపీ మిత్రులే షాకిచ్చిన వేళ

బెంగళూరు మెయిల్ ఓపెన్ చేయడంతో..

బెంగళూరు మెయిల్ ఓపెన్ చేయడంతో..

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఆఫీసులో పని చేస్తోన్న ఓ ఉద్యోగికి.. ఈనెల మొదటివారంలో ఓ ఈమెయిల్ వచ్చిందని, దాన్ని తెరచి, అందులోని లింక్ ను ఓపెన్ చేయగానే ఆ కంప్యూటర్ లోని డేటా మొత్తం ఎగిరిపోయిందని, సదరు ఉద్యోగి కంప్యూటర్ తో ఇంటర్ లింకులున్న మరో 100 కంప్యూటర్లలోనూ డేటా మాయమైపోయిందని తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ఎన్ఐసీ డేటా చోరీకి కారణమైన ఆ మెయిల్.. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఓ అమెరికన్ ఐటీ కంపెనీ సర్వర్ నుంచి వచ్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

వీవీఐపీల డేటా హ్యాకైందా?

వీవీఐపీల డేటా హ్యాకైందా?

ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సహా పలువురు ప్రముఖుల సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతోపాటు, దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిర్వహిస్తుండటం, ఇప్పుడా సంస్థ కంప్యూటర్లే హ్యాక్ కు గురికావడంతో మోదీ, దోవల్ సహా వీవీఐపీల సెక్యూరిటీ డేటా లీకైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐసీ కంప్యూటర్లలోకి మాల్ వేర్ ప్రవేశించినట్లు నిర్ధారించిన పోలీసులు.. హ్యాకర్లు దొంగించిన డేటాపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

English summary
In a major security breach, more than 100 computers of the National Informatics Centre (NIC), which is responsible for securing critical cyber infrastructure in the country and the Ministry of Electronics and Information Technology (MeitY), were found to be compromised. Soon after the bug was identified, Delhi Police’s special cell registered a case under the Information Technology (IT) Act early September and began investigation, which led them to a firm in Bengaluru, from where the bug was generated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X