• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'నీ అందమైన ముఖంపై యాసిడ్ పోస్తాం... ఇంకెక్కడికీ తిరగలేవు...' లోక్‌సభ లాబీలో మహిళా ఎంపీకి బెదిరింపులు..?

|

లోక్‌సభలో మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తనను జైలుకు పంపిస్తానంటూ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని ఎంపీ నవనీత్ కౌర్ రానా ఆరోపించారు. అంతేకాదు,తనపై యాసిడ్ దాడి చేస్తామని శివసేన కార్యకర్తల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్‌తో పాటు ఆ పార్టీ లెటర్ హెడ్‌తో కూడిన బెదిరింపు లేఖలు వస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎంపీ నవనీత్ కౌర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ అరవింద్ సావంత్ నవనీత్ కౌర్ ఆరోపణలను ఖండించారు. తోటి మహిళా ఎంపీకి హాని తలపెట్టే బెదిరింపులకు పాల్పడితే తాను అండగా నిలబడుతానని తెలిపారు.

లోక్‌సభలో లాబీలో బెదిరించారు... : నవనీత్

లోక్‌సభలో లాబీలో బెదిరించారు... : నవనీత్

'ఇవాళ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ లోక్‌సభ లాబీలో నన్ను బెదిరించారు. నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా... నిన్ను జైల్లో పెట్టిస్తాం... అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ మాటలకు నేను బ్లాంక్ అయిపోయాను. అక్కడినుంచి వెనుదిరిగాను. ఇది నాకు మాత్రమే కాదు... యావత్ దేశ మహిళలకు జరిగిన అవమానంగా నేను పరిగణిస్తున్నాను. అరవింద్ సావంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాను.' అని నవనీత్ కౌర్ పేర్కొన్నారు. నవనీత్ కౌర్‌ను అరవింద్ సావంత్ బెదిరించినప్పుడు ఆమెకు కొద్ది దూరంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఉన్నట్లు తెలుస్తోంది. అరవింద్ బెదిరింపులను ఆ ఎంపీ కూడా విన్నారని నవనీత్ తెలిపారు.

ముఖంపై యాసిడ్ పోస్తామని బెదిరింపులు...

ముఖంపై యాసిడ్ పోస్తామని బెదిరింపులు...

'ఇంతకుముందు కూడా పోలీసులకు,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశాను. శివసేన తరుపున బెదిరింపు లేఖలు వస్తున్నాయని చెప్పాను.'నువ్వు లోక్‌సభలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే గురించి మాట్లాడితే... నీ గర్వానికి కారణమైన నీ అందమైన ముఖంపై యాసిడ్ పోస్తాం... దాంతో ఇక ఎక్కడికీ తిరగలేవు...' అంటూ శివసేన పేరుతో వచ్చిన లేఖల గురించి చెప్పాను.' అని నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న అంబానీ ఇంటి వద్ద బాంబు కలకలం కేసుపై లోక్‌సభలో నవనీత్ కౌర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ హోంమంత్రిపై చేసిన అవినీతి ఆరోపణలను ఆమె సభలో ప్రస్తావించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఉద్దవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఖండించిన శివసేన ఎంపీ...

ఎంపీ నవనీత్ కౌర్ ఆరోపణలను ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. నవనీత్ బాడీ లాంగ్వేజ్,ఆమె మాటలు ఏమాత్రం సరికాదన్నారు.'నేనెందుకు ఆమెను బెదిరిస్తాను... ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా ఆమెకు సమీపంలో ఉంటే.. నేను బెదిరించానని వాళ్లు కూడా చెప్పేవారు కదా... ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు...' అని అరవింద్ సావంత్ అన్నారు. 'నా జీవితంలో ఇప్పటివరకూ నేనెవరినీ బెదిరించలేదు.. అలాంటిది ఓ మహిళను నేను బెదిరించడమేంటి.. కేవలం పబ్లిసిటీ కోసమే నవనీత్‌ కౌర్‌ ఈ ఆరోపణలు చేస్తున్నారు..' అని సావంత్ పేర్కొన్నారు.

English summary
Amaravati's independent MP Navneet Kaur Rana has alleged that the Shiv Sena's Arvind Sawant threatened her in the lobby of the Lok Sabha, warning her of being jailed for talking in the House against the Maharashtra government. In what could be a more serious charge, she has also informed Speaker Om Birla of receiving acid-attack threats through phone calls and on Shiv Sena letterheads. The Sindhudurg member has, however, denied the allegations and, instead, said he would "stand with" the woman member if anyone threatens her with bodily harm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X