వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంపేస్తారని భయంగా ఉంది, ఎన్నికల ముందు తరువాత, లేడీ ఎమ్మెల్యే ఆవేదన, గన్ మ్యాన్ లు!

|
Google Oneindia TeluguNews

దక్షిణ కన్నడ: కొందరు గుర్తు తెలియని వ్యక్తుల వలన తనకు ప్రాణహాని ఉందని, ప్రత్యేకంగా గన్ మ్యాన్ లను నియమించి తనకు రక్షణ కల్పించాలని కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కారవారకు చెందిన లేడీ ఎమ్మెల్యే రూపాలి నాయక్ అధికారులకు లేఖ రాశారు.

గవర్నర్, హోం శాఖ మంత్రి, పోలీసు శాఖ డీజీపీతో పాటు జిల్లా పోలీసు అధికారులకు రక్షణ కల్పించాలని లేడీ ఎమ్మెల్యే రూపాలి నాయక్ మనవి చేశారు. శాసన సభ ఎన్నికల ముందు, ఆ తరువాత తనకు బెందిరింపులు ఎక్కువ అయ్యాయని, గుర్తు తెలియని వాహనాలు తన వాహనాన్ని వెంబడిస్తున్నాయని ఎమ్మెల్యే రూపాలి నాయక్ ఆరోపిస్తున్నారు.

Threatened by strangers: For this reason MLA Rupali Naik wrote a letter and requested to District Police Superintendent.

తన ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని, తన కుటుం సభ్యులు, అనుచరులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే రూపాలి నాయక్ ఆరోపిస్తున్నారు. పల్సర్ బైక్ ల్లో కొందరు వ్యక్తులు నిత్వం ఇంటి దగ్గర అటూ ఇటూ సంచరిస్తున్నారని, భయంగా ఉందని రూపాలి నాయక్ అంటున్నారు.

గత నవంబర్ 30వ తేదీ రాత్రి 12 గంటలకు ఆంకోళలో ఒక కార్యక్రమం ముగించుకుని ఇంటికి వెలుతున్నానని, ఆ సమయంలో రెండు కార్లతో తన వాహనాన్ని వెంబడించారని, వెంటనే భయంతో నెవెల్ హోటల్ గేటు బయట కారు నిలిపానని, తరువాత పోలీసుల రక్షణతో ఇంటికి చేరుకున్నానని ఎమ్మెల్యే రూపాలి నాయక్ పై అధికారులకు లేఖలో ఫిర్యాదు చేశారు.

తన ఇంటి దగ్గర ఇంత జరుగుతున్నదని, తనకు తన కుటుంబ సభ్యులు, అనుచరులకు హాని జరుగుతుందని భయంగా ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని జిల్లా ఎస్పీకి రాసిన లేఖలో ఎమ్మెల్యే రూపాలి నాయక్ వివరించారు. తనకు ప్రాణహాని ఉందని స్పష్టంగా తెలుస్తోందని, వెంటనే గన్ మ్యాన్ (సాయుధ పోలీసులు)లను ఏర్పాటు చెయ్యాలని ఎమ్మెల్యే రూపాలి నాయక్ పోలీసు అధికారులకు మనవి చేశారు.

English summary
Threatened by strangers: For this reason MLA Rupali Naik wrote a letter and requested to District Police Superintendent. Rupali Naik mentioned in letter give me protection, please appoint armed police constable for protection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X