ఇద్దరు భార్యల ముద్దుల డాక్టర్: భర్తను భాగం పెట్టిన పోలీస్: ఓపిక కోసం ఒక్క రోజు లీవ్ !
పాట్నాలో డాక్టర్ అరుణ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. ఇతను పాట్నాలోనే ఓ క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. ఓ సందర్బంలో అనుకోని పరిస్థితుల్లో అరుణ్ కుమార్ వివాహం చేసుకోవాలసి వచ్చింది.
పాట్నా: ఇద్దరు భార్యల గొడవతో భర్త ఎలా నలిగిపోతాడో చెప్పడానికి నిజజీవితంలో ఇదో చక్కటి ఉదాహరణ. భారతదేశ చట్ట ప్రకారం ఓ వ్యక్తి రెండు పెళ్లీళ్లు చేసుకోవడం నేరం. ఒక వేళ భార్య చనిపోతే పెద్దలు, కుటుంబ సభ్యుల అనుమతితో రెండో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శోభన్ బాబు, శారదా, వాణిశ్రీ జంటగా నటించిన ఏవండోయ్ ఆవిడ వచ్చింది సినిమాలలో భర్తను ఎలా పంచుకుంటారో అచ్చం అలాగే ఇక్కడా జరిగింది. ఆ సినిమాలో శోభన్ భాబు మూడు రోజులు శారదా ఇంట్లో, మూడు రోజులు వాణిశ్రీ ఇంట్లో ఉంటాడు. ఒక్క రోజు తండ్రి సత్యనారాయణ ఇంట్లో ఉంటాడు. అచ్చం ఈ సినిమాలో స్టోరీ ఎలాగుందో నిజ జీవితంలో ఓ వ్యక్తికి బీహార్ పోలీసులు ఇలాగే రాజీ చేశారు.
పాట్నాలో డాక్టర్ అరుణ్ కుమార్ !
పాట్నాలో డాక్టర్ అరుణ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. ఇతను పాట్నాలోనే ఓ క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. ఓ సందర్బంలో అనుకోని పరిస్థితుల్లో అరుణ్ కుమార్ వివాహం చేసుకోవాలసి వచ్చింది. అయితే అతనికి అంతకు ముందే పెళ్లి అయ్యిందని రెండో భార్యకు తెలీదు.
మిస్సెస్ మీనా అరుణ్, మిస్సెస్ పూజా అరుణ్ !
డాక్టర్ అరుణ్ కుమార్ కు మొదట మీనా అనే మహిళతో వివాహం అయ్యింది. తరువాత అనుకోని పరిస్థితుల్లో పూజాను వివాహం చేసుకున్నాడు. ఇతను రాత్రి పూట సక్రమంగా ఇంటికి రావడం లేదని మీనా, పూజాలకు అనుమానం వచ్చింది.
ఒక చోట ఉంటే మరో చోట కాపురం ఎలా ?
డాక్టర్ అరుణ్ కుమార్ మీనాతో కాపురం చేస్తుంటే ఇంటికి రాలేదని పూజాకు అనుమానం వచ్చింది. పూజాతో కాపురం చేస్తంటే రాత్రి ఇంటికి రావడం లేదని మీనాకు అనుమానం వచ్చింది. ఇలా ఇద్దరు భార్యల మద్యలో అరుణ్ కుమార్ విలవిలలాడిపోయాడు.
మీనాకు విషయం తెలిసింది
పూజాను రహస్యంగా వివాహం చేసుకున్నాడని మొదటి భార్మ మీనా పసిగట్టింది. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని మీనా పాట్నాలోని ఫుల్ వారీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అరుణ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో హాజరై తాను మీనా, పూజాను ఇద్దరినీ వివాహం చేసుకున్నానని, తప్పు జరిగిందని నేరం అంగీకరించాడు..
జుట్టు పట్టుకున్న మీనా, పూజా
అరుణ్ కుమార్ విషయంలో అతని ఇద్దరు భార్యలు మీనా, పూజా పోలీసుల ముందే ఒకరి జట్టు ఒకరు పట్టుకున్నారు. పోలీసులు ఇద్దరికీ నచ్చి చెప్పి ఓ రాజీమార్గాన్ని వారి ముందు పెట్టారు. పోలీసులు సూచించిన రాజీ మార్గానికి అరుణ్ కుమార్, అతని ఇద్దరు భార్యలు మీనా, పూజా అంగీకరించారు.
అలసిపోతే ఒక్క రోజు సెలవు !
మూడు రోజులు మొదటి భార్య మీనాతో కాపురం చెయ్యాలని, మూడు రోజులు రెండో భార్య పూజాతో కాపురం చెయ్యాలని, వారంలో ఒక్క రోజు సెలవు తీసుకోవాలని పోలీసులు అరుణ్ కుమార్ కు చెప్పారు. అందుకు మీనా, పూజా ఇద్దరూ అంగీకరించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
కాపురాలు నాశనం అవుతాయని !
రెండో పెళ్లి చేసుకున్నందుకు డాక్టర్ అరుణ్ కుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపిస్తే ఇద్దరు మహిళల కాపురం నాశనం అవుతోందని పోలీసులు ఈ రాజీ ఫ్మార్ములా తెరమీదకు తీసుకు వచ్చారు. అయితే రాజీ చేసిన తరువాత నీవు రెండో పెళ్లి చేసుకోవడానికి ఎదురైన సమస్య ఏమిటీ ? అని పోలీసులు ప్రశ్నిస్తే ఆ ఒక్కటి అడక్కు అంటూ డాక్టర్ అరుణ్ కుమార్ పోలీస్ స్టేషన్ నుంచి జారుకున్నాడని తెలిసింది.