వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్రాస్ బాధిత కుటుంబానికి మూడంచెల రక్షణా వ్యవస్థ .. సుప్రీంకు వివరణ ఇచ్చిన యూపీ సర్కార్

|
Google Oneindia TeluguNews

హత్రాస్ దళిత యువతి సామూహిక హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షులకు మూడంచెల రక్షణా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దర్యాప్తుపై 15 రోజుల స్టేటస్ రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని సిబిఐని కోర్టు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసు గురించి ఫేక్ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయనే కారణంతో, యూపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువగా మారిన కారణంగా దర్యాప్తును సిబిఐకి సూచించటంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ముందు సుముఖత వ్యక్తం చేసింది.

హత్రాస్ యువతి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం..కోర్టుకు వారి విజ్ఞప్తులే ఒత్తిడికి సాక్ష్యం హత్రాస్ యువతి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం..కోర్టుకు వారి విజ్ఞప్తులే ఒత్తిడికి సాక్ష్యం

సీబీఐ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన యూపీ సర్కార్

సీబీఐ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన యూపీ సర్కార్

హత్రాస్ ఘటనపై సిబిఐ నిర్ణీత సమయంలో విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని విన్నవించిన ఉత్తరప్రదేశ్ సర్కార్, ఆ నివేదికను యూపీ ప్రభుత్వానికి అందించేలా ఆదేశించాలని కోరింది. అంతేకాదు క్రమం తప్పకుండా ఉత్తరప్రదేశ్ డిజిపి ఆ నివేదికను సుప్రీంకోర్టు సమర్పిస్తారని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో న్యాయ దర్యాప్తును నిర్వహించటానికి బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు పూర్తి భద్రత కల్పించడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని పేర్కొంది .

హత్రాస్ బాధిత కుటుంబానికి 16మంది సిబ్బందితో మూడంచెల రక్షణ

హత్రాస్ బాధిత కుటుంబానికి 16మంది సిబ్బందితో మూడంచెల రక్షణ

బాధిత యువతి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఒక బావ మరియు ఆమె అమ్మమ్మ హత్రాస్ జిల్లాలోని చందపా గ్రామంలో నివసిస్తున్నారు.వారి భద్రత కోసం తగిన బలగాలను ఏర్పాటు చేశామని ఉన్నత కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెలిపింది.బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు సాక్షులకు అందించిన రక్షణ మరియు భద్రత వివరాలను తెలియజేస్తూ, ఆమె ఇంటి సమీపంలో మరియు వెలుపల 16 మంది వరకు సాయుధ పోలీసులు కాపలా నిర్వహిస్తారని, మూడంచెల రక్షణ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది .ఎనిమిది సిసిటివి కెమెరాలు ఉన్నాయని వారి ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేశామని చెప్పింది .

హత్రాస్ ఎంట్రన్స్ లో కూడా పోలీసుల బందోబస్తు

హత్రాస్ ఎంట్రన్స్ లో కూడా పోలీసుల బందోబస్తు

ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌ను విన్నసుప్రీం ధర్మాసనం హత్రాస్ సంఘటనను భయంకరమైన సంఘటనగా పేర్కొంది సుప్రీం కోర్టు. అక్టోబర్ 6 న కోర్టు ఆదేశాలకు అనుగుణంగా యూపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది . బాధిత యువతి కుటుంబ సభ్యులను ,సాక్షులను రక్షించడానికి తీసుకున్న చర్యల గురించి తెలియజేయమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. బాధితురాలి గ్రామ ఎంట్రన్స్ లో , ఆమె ఇంటి సమీపంలో, ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరియు నలుగురు లేడీ కానిస్టేబుళ్ళతో సహా మొత్తం 16 మంది పోలీసు సిబ్బంది ఉంటారని స్పష్టం చేసింది.

Recommended Video

Bollywood లో AR Rahman కి వ్యతిరేకం గా ఓ గ్యాంగ్, Bollywood Mafia పై AR Rahman || Oneindia Telugu
వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగనివ్వం అన్న యూపీ సర్కార్

వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగనివ్వం అన్న యూపీ సర్కార్

అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కోవడానికి ముందస్తు భద్రతలో భాగంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు యోగి ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు సాక్షుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎటువంటి పరిస్థితిలోనూ జోక్యం చేసుకోబోమని, ఇక ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వర్తించే పోలీసులకు కూడా చెప్పామని కోర్టుకు తెలిపింది. వారి స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని, ఎలాంటి ఆటంకాలను ప్రభుత్వం వైపు నుంచి కల్పించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

English summary
The Uttar Pradesh government informed the Supreme Court that a "three-fold protection mechanism" has been put in place for the security of the victim's family members and witnesses in the Hathras case in which a Dalit girl was allegedly brutally raped and died due to injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X