వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె సంకల్పం గొప్పది: 3 అడుగులు, వయసు 19

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: ఆమె ఎత్తు మూడడుగులే. వయసు మాత్రం 19 సంవత్సరాలు. పుట్టుకతోనే అకాండ్రాప్లాసియా అనే జబ్బుతో బాధపడుతున్న ఆమె పేరు పియాశా మహల్దార్. చిన్నప్పటి నుంచే ఈ జబ్బు బారిన పడడంతో ఆమె శరీర భాగాలు పెరగ లేదు. దీంతో ఆమె మూడడుగులకే పరిమితమైంది.

అంతేకాదు కాళ్లు, చేతులు, వేళ్లు అన్ని పెరుగుదలను లోపించి ఉన్నాయి. దీంతో ఆమె కూర్చోలేదు, నించోలేదు. దీంతో ఆమె ఎక్కడికైనా వెళ్లాలంటే తల్లిదండ్రులు తీసుకెళ్లాల్సిందే. అలాంటి ఆమె సంకల్పం ముందు పరీక్ష కూడా చిన్నబోయింది.

వివరాల్లోకి వెళితే.... పశ్చిమ బెంగాల్‌లోని శాంతిపూర్‌కు చెందిన పియాశా మహల్దార్ అనే మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. అయితేనేం చదువు కోవాలనే ఆమె సంకల్పం ముందు అంగవైకల్యం వెనుకబడింది. ప్రస్తుతం ఆమె అమర్తలా ప్రాథమిక పాఠశాలలో సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతోంది.

Three-foot wonder girl takes higher secondary exam

చదువులో భాగంగా శాంతిపూర్ ఓరియెంటల్ అకాడమీలో పరీక్షలకు హాజరైంది. ఇందులో భాగంగా ఆమెకోసం అధికారులు ప్రత్యేక గదిలో ఓ టేబుల్ ఏర్పాటు చేశారు. కూర్చోలేని ఆమె టేబుల్‌పై పడుకొని పరీక్షను రాసింది. అంతేకాదు తాను పరీక్ష రాసేందుకు మరో గంట అదనంగా కేటాయించారు.

చదువుకోడాన్ని ఎంతగానో ఇష్టపడే ఆమె గతంలో జరిగిన పరీక్షల్లో కూడా అసాధారణ ప్రతిభను కనబరిచింది. శారీరకంగా వైకల్యం ఉన్నప్పటికీ ఆ ఆలోచనను ఎప్పుడూ తన మనసులోకి రానివ్వకుండా గొప్ప స్థానానికి వెళ్లాలన్న లక్ష్యంతో ఆమె దూసుకెళ్లిపోతుంది.

English summary
She is only three feet tall and suffers from achondroplasia, the most common form of short stature with disproportionately short limbs (that is, dwarfism with short arms and legs). The medical condition that makes life’s smallest tasks difficult for her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X