వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణతంత్ర దినోత్సవం వేళ.. గ్రెనేడ్ల మోత: శక్తిమంతమైన పేలుళ్లు: అరగంట వ్యవధిలో.. !

|
Google Oneindia TeluguNews

గువాహటి: దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు కొనసాగుతున్న వేళ.. అస్సాం గ్రెనేడ్ల మోతలతో మారుమోగిపోయింది. రెండు వేర్వేరు జిల్లాల్లో మూడు శక్తిమంతమైన గ్రెనేడ్ల పేలుళ్లు అస్సాంను ఉలిక్కిపడేలా చేశాయి. అరగంట వ్యవధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అస్సాంవాసులను వణికించాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

అస్సాంలోని దిబ్రూగఢ్, చరైడియో జిల్లాల్లో ఆదివారం తెల్లవారు జామున ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 37వ జాతీయ రహదారి వెంట ఉన్న గ్రాహం బజార్‌లో తొలుత రెండు గ్రెనేడ్లు పేలాయి. అనంతరం అరగంట వ్యవధిలో ఓ గరుద్వారా వద్ద మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదని అస్సాం పోలీసు డైరెక్టర్ జనరల్ భాస్కర్ జ్యోతి మహంత్ తెలిపారు. ఈ పేలుడు చోటు చేసుకోవడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నామని అన్నారు.

Three grenade explosions at Dibrugarh, Charaideo districts in Assam

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పేలుళ్లు చోటు చేసుకున్న గ్రాహం బజార్, గురుద్వార వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగుర వేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఈ కార్యక్రమాన్ని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని స్థానికులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలు కూడా భద్రతా బలగాలు గుప్పిట్లో ఉన్నాయి. గ్రెనేడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వాటిని అమర్చారు? కుట్ర కోణం ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ పేలుళ్ల వెనుక విద్రోహ శక్తుల హస్తం ఉండొచ్చంటూ అనుమానాలు వ్యక్తమౌతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు దిబ్రూగఢ్, చరైడియా జిల్లాల్లోనే పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు భాస్కర్ జ్యోతి వెల్లడించారు. ఆందోళనకారులు ఉద్దేశపూరకంగా వాటిని అమర్చి ఉండే అవకాశాలను కొట్టి పారేయట్లేదని తెలిపారు.

English summary
Three grenade explosions in Upper Assam districts of Dibrugarh and Charaideo took place within 30 minutes time span on Sunday. The first explosion was reported at a shop near NH 37 at Graham Bazaar while the second explosion took place near a Gurudwara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X