మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
ఇంపాల్: ఇంపాల్‌లోని ఓ మార్కెట్ సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద ఆదివారం ఉదయం బాంబు పేలింది. బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషయంగా ఉంది.
క్షతగాత్రులను సమీపంలోని రీజీనల్ ఇనిట్యిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరిగిన అనంతరం హుటాహుటిన సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్ధలికి చేరుకున్నారు.

ఐతే అధికారకంగా ఏ మిలిటెంట్ గ్రూపు కూడా ఈ బాంబు పేలుడు ఘటనకు తామే బాధ్యులమంటూ వెల్లడించలేదు. మణిపూర్ ముఖ్యమంత్రి ఓ ఐబోబి సింగ్ బాంబు పేలుడు ఘటనను ఖండించారు. బాంబు పేలుడు ఘటన వేర్పాటు వాదలు పనేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మణిపూర్‌లో నెలలో ఇలా జరగడం ఇది మూడోసారి. డిసెంబర్ 15న ఇంఫాల్ మార్కెట్‌లో సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications