వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు నెలలు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనా ప్రపంచ దేశాలనే కాదు ఇటు ఇండియాను వణికిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం . బతికుంటే బలిసాకు తిని బ్రతకొచ్చు అన్న చందంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో ఎక్కడికక్కడ పనులు, వర్తక వాణిజ్యాలు ఆగిపోయాయి. ప్రజలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డారు. కరోనా వల్ల అటు ప్రభుత్వాలే ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితి .

 ప్రజల మీద భారం పడకుండా ఊరట నిచ్చే ఆలోచనలో కేంద్రం

ప్రజల మీద భారం పడకుండా ఊరట నిచ్చే ఆలోచనలో కేంద్రం

ఇక ఈ నేపధ్యంలో ప్రజలు ప్రభుత్వాలకు చెల్లించాల్సిన టాక్స్ లు, రుణాల విషయంలో మూడు నెలల పాటు ఊరట నిచ్చింది కేంద్రం .కరోనా వైరస్ వాళ్ళ తలెత్తిన ఇబ్బంది నుండి ప్రజలను కాపాడటానికి ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇచ్చింది . కరోనా వలన వలస కూలీలు రోడ్డున పడిన పరిస్థితుల్లో రోడ్డున పడిన కూలీలకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక ఇప్పటికే చాలామంది ఇంటికే పరిమితం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ ను అందిస్తుంది.

కరెంట్ బిల్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

కరెంట్ బిల్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

అదే విధంగా ప్రతి కుటుంబానికి కొంత డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చాలా మంది సామాన్య , మధ్యతరగతి ప్రజలు పని చెయ్యకుండా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి జీవనం సాగింహాలంటే భయపడుతున్న పరిస్థితి. భవిష్యత్ గురించి తలుచుకుని ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం లాక్ డౌన్ నేపధ్యంలో కనిపిస్తుంది. అందుకే కేంద్రం అన్ని రకాల లోన్ల పై మూడు నెలల మారటోరియం విధించింది. అయితే, ప్రతి నెల తప్పనిసరిగా చెల్లించాల్సిన కరెంట్ బిల్ విషయంలో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరెంటు బిల్లు చెల్లింపులకు సంబంధించి అన్నీ రాష్ట్రాలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
 మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆదేశాలు

మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆదేశాలు

ప్రజలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న కారణంగా వారికి కరెంట్ బిల్లుల చెల్లింపుకు మూడు నెలల మారటోరియం విధించాలని నిర్ణయం తీసుకుంది . కరెంటు బిల్లుల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించాలని భావించిన కేంద్రం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు కూడా ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మూడు నెలల పాటు కరెంట్ బిల్లులపై మారటోరియం విధించాలని కేంద్రం పవర్ జనరేషన్ కంపెనీలను కోరింది. ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య , మధ్యతరగతి ప్రజానీకానికి ఒకింత ఊరట .

English summary
Central Electricity Regulation Commission has also ordered to impose a three-month moratorium on the payment of current bills. The Center has asked power generation companies to impose a moratorium on current bills for three months, saying that people are facing difficulties due to lockdown. However, the decision taken by the Center is some relaxation for the general and middle class masses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X