వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి షాక్ : గోవాలో కొత్త కూటమి,చరిత్ర సృష్టించేనా?

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజిపి, జిఎస్ ఎం, శివసేన పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.ఈ నిర్ణయం బిజెపికి రాజకీయంగా నష్టం కల్గించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గోవా :ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో గోవాలో రాజకీయ సమీకరణాలు మారాయి. అధికార బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీతో పొత్తు కొనసాగిస్తూ వచ్చిన మహరాష్ట్ర గోమంతక్ పార్టీ కొత్త కూటమిని ఏర్పాటుచేసింది. ఈ కూటమిలో మూడు పార్టీలున్నాయి. ఈ మూడు పార్టీల కూటమి కలిసి పోటీచేయనున్నట్టు ప్రకటించాయి.

గోవాలో బిజెపి అధికారంలో ఉంది. అయితే బిజెపితో కలిసి అధికారాన్ని పంచుకొన్న గోమంతక్ పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకొంది. శివసేన, గో సురక్ష మంచ్ తో కలిసి కూటమిని ఏర్పాటుచేసింది. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేయనున్నట్టు ప్రకటించాయి.

ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేయాలని ప్రకటించడం బిజెపికి షాక్ కల్గించింది. ఈ పరిణామం కొంత బిజెపికి రాజకీయంగా కొంత నష్టం కల్గించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బిజెపితో పొత్తును ఉపసంహరించుకొంటున్నట్టు ఎంజిపి ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు ఆ రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశాడు.

షెడ్యూట్ విడుదలయ్యాక బిజెపి దూరమైన ఎంజిపి

షెడ్యూట్ విడుదలయ్యాక బిజెపి దూరమైన ఎంజిపి

ఈ నెల 4వ, తేదిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ విడుదలైన మరునాడే గోవాలో బిజెపి ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతును ఉపసంహరించుకొంటుందని మహరాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజిపి) ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల ఐదవ తేదినే ఆ రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాసింది ఆ పార్టీ. 2012 లో జరిగిన ఎన్నికల్లో బిజెపి, ఎంజిపిలు కలిసి పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో బిజెపి 21 స్థానాల్లో ఎంజిపి మూడు స్థానాల్లో విజయం సాధించాయి.

మూడు పార్టీల కూటమి పోటీకి సిద్దం

మూడు పార్టీల కూటమి పోటీకి సిద్దం

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేసేందుకు సన్నద్దమయ్యాయి.ఈ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనేందుకు గాను ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. శివసేన, గో సురక్ష, మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీలు కూటమిగా పోటీచేయనున్నాయి. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేయడంతో బిజెపికి కొంత నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బిజెపి పై ఎంజిపి విమర్శలు

బిజెపి పై ఎంజిపి విమర్శలు

గోవా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వంతో ఎంజిపి భాగస్వామ్యపార్టీగా ఉంది.అయితే బిజెపి తీరును ఎంజిపి తప్పుబడుతోంది.సంకీర్ణ ధర్మాన్ని ఆ పార్టీ నెరవేర్చడం లేదని ఎంజిపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిజెపికి మద్దతును ఉపసంహరించుకొన్నట్టు ఆ పార్టీ చెబుతోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం వెలువరచడం రాజకీయంగా విమర్శలు చేసేందుకే ఈ రకమైన ఆరోపణలను ఎంజిపి చేస్తోందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఈ కూటమి ప్రభావం చూపేనా?

ఈ కూటమి ప్రభావం చూపేనా?

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల ప్రకారంగా బిజెపికి అనుకూలమైన వాతావరణమే ఉందని సర్వేలు చెబుతున్నాయి.అయితే ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేస్తున్నందున తక్కువగా అంచనాకూడ వేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ మూడు పార్టీలు ప్రభావం చూపగలిగితే బిజెపికి కొంత నస్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని ఆపార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.

English summary
Three parties announced alliance in goa assembly elections mgp, gsm and shivshena parties alliance for goa assembly elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X