బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు సిటీ బస్సులో ఆంధ్రా యువకుడి దారుణ హత్య, రాయలసీమ, వేటకోడవళ్లు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

యువకుడి దారుణ హత్య, బెంగళూరు లో ఉండే తెలుగు వాళ్ళు జాగ్రత్త

బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రతినిత్యం సంచరించే బీఎంటీసీ (సిటీ బస్సు)లో పట్టపగలు ప్రయాణికులు అందరూ చూస్తున్న సమయంలో యువకుడిని వేటకోడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు. ప్రత్యర్థి చనిపోయాడని నిర్దారించుకున్న తరువాత హంతకులు దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. హత్యకు గురైయ్యింది ఆంధ్రా యువకుడని, హంతకులు రాయలసీమ యాసలో మాట్లాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

అనేకల్ టూ బెంగళూరు

అనేకల్ టూ బెంగళూరు

బుధవారం తమిళనాడు శివార్లలోని అనేకల్ నుంచి బెంగళూరులోని మెజస్టిక్ కు బీఎంటీసీ బస్సు బయలుదేరింది. మార్గం మధ్యలో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కూనప్పన అగ్రహార దగ్గర బస్సు డ్రైవర్ కొంత వేగం తగ్గించాడు.

ప్రాణాల కోసం !

ప్రాణాల కోసం !

బస్సు మెల్లిగా వెలుతున్న సమయంలో ఓ యువకుడు (32) పరుగున వచ్చి బస్సులో ఎక్కాడు. అదే సమయంలో యువకుడిని వెంబడించిన ముగ్గురు అదే బీఎంటీసీ బస్సులో ఎక్కారు. చేతిలో ఉన్న వేటకోడవళ్లతో యువకుడి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు.

చచ్చాడు పదండి

చచ్చాడు పదండి


యువకుడి మీద వేటకోడవళ్లతో దాడి చేస్తున్న సమయంలో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ప్రయాణిలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు పరుగు తీశారు. యువకుడి మీద దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు వీడు చచ్చాడు పదండిరా అంటూ తెలుగులో గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారు.

 హంతకుల్లో వృద్దుడు

హంతకుల్లో వృద్దుడు

బీఎంటీసీ బస్సులో యువకుడు హత్యకు గురైనాడని తెలుసుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. హంతకుల్లో 60 ఏళ్ల వృద్దుడు, 30 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు యువకులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు అన్నారు.

హంతకులది ఆంధ్రా

హంతకులది ఆంధ్రా

బీఎంటీసీ బస్సులో యువకుడిని హత్య చేసిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని, రాయలసీయ యాసలో మాట్లాడారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇచ్చారని పోలీసులు అన్నారు. హత్యకు గురైన యువకుడి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం, అతని వివరాలు తెలీలేదని, మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Group of three persons stabbed a man in running BMTC bus near electronic city. The bus was coming to Bengaluru from Anekal. Another example for the silicon city becoming crime city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X