వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు ప్లాన్స్: ఎమ్మెల్యేల తరలింపుకు కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహం?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎమ్మెల్యేల తరలింపుకు కాంగ్రెస్, జేడీఎస్ మూడు ప్లాన్స్

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సాయంత్రం 4.30కి యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష ఉండటంతో.. ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వందకు నూటా ఒక్క శాతం తమదే విజయమని యడ్యూరప్ప చెబుతున్న మాటలే నిజమవుతాయా?.. లేక బలనిరూపణలో ఆ పార్టీ తేలిపోతుందా? అన్నది వేచి చూడాలి.

బలనిరూపణకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను మరింత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న తమ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు పకడ్బంధీ ప్లాన్ వేస్తున్నాయి. ఎమ్మెల్యేల తరలింపు కోసం మూడు ప్లాన్లను సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల తరలింపుకు ప్లాన్-1:

ఎమ్మెల్యేల తరలింపుకు ప్లాన్-1:

ఏ క్షణమైనా ఎమ్మెల్యేలను తరలించడానికి రెండు ప్రత్యేక విమానాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇక్కడి నుంచి బయలుదేరటానికి సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి. ప్రత్యేక విమానాలు కాబట్టి గంటన్నరలో ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకోనున్నారు. అయితే నిన్న రాత్రి బెంగళూరులో డీజీసీఏ ప్రత్యేక విమానాన్ని నిరాకరించడంతో.. అలాంటి పరిస్థితి ఏమైనా తలెత్తితే వెంటనే ప్లాన్-2ను అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ప్లాన్-2:

ప్లాన్-2:

ప్రత్యేక విమానాలకు అనుమతి నిరాకరిస్తే.. ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా బెంగళూరుకి తరలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం 4 ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. బస్సుల్లో అయితే బెంగళూరుకు 8గం. సమయం పట్టనుంది. నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఇస్తూ ఏపీ మీదుగా ఎమ్మెల్యేలను బెంగళూరును తరలించనున్నారు.

ప్లాన్-3:

ప్లాన్-3:

ప్రత్యేక విమానాలు, బస్సులు ఈ రెండింటి ద్వారా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కార్ల ద్వారా ఎమ్మెల్యేలను తరలించాలని ప్లాన్-3ని కూడా సిద్దం చేసింది బీజేపీ. ఒక్కో కారులో నలుగురు ఎమ్మెల్యేలను తరలించడానికి ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద రేపటి బలనిరూపణలో యడ్యూరప్పను ఓడించబోతున్నామని కాంగ్రెస్, జేడీఎస్ లు ధీమాగా చెబుతున్నాయి.

సీఎల్పీ నేతగా సిద్దరామయ్య:

సీఎల్పీ నేతగా సిద్దరామయ్య:

ఎమ్మెల్యేల తరలింపుకు ముందు తాజ్ క్రిష్ణ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో.. మాజీ సీఎం సిద్దరామయ్యను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా పాల్గొన్నారు. రేపు బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీ ఎలా వ్యవహరించాలన్న దానిపై సభ్యులకు సలహాలు సూచనలు చేశారు.

English summary
Congress party made all arrangements to shift their MLA's from Hyderabad to Bengaluru, for this they made three alternate plans
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X