వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు తోనే గేమ్స్.... సెల్ఫీ తీసుకుంటు ముగ్గురు యువకుల మృతి

|
Google Oneindia TeluguNews

హర్యాణలో లోని ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై సెల్పీలు దిగుతూ మృత్యువాత పడ్డారు. రైలు వస్తున్న సమయంలో ఫోటోలు తీసకుంటుండగా దగ్గరి వచ్చిన నేపథ్యంలోనే మరో ట్రాక్ పై దూకారు.అయితే రెండో ట్రాక్ పై కూడ రైలు రావడాన్ని గమనించని యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ముగ్గురు హర్యానకు చెందిన వారే

ముగ్గురు హర్యానకు చెందిన వారే

హర్యానాలోని పానిపట్ రైల్వేస్టేషన్ కు 2 కిలోమీటర్లు దూరంలో ఢిల్లి -అంబాల మార్గంలోని పానిపట్ ,బాబర్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య ముగ్గురు యువకు సెల్ఫీలు తీసుకుంటూ రైలు క్రింద పడి మృతి చెందారు. 18 నుండి 20 ఏళ్ల వయస్సున్న సన్ని , చమన్ ,కిషన్ అనే ముగ్గురు యువకులు బంధువులు కూడ అవుతారు , సన్ని మరియు చమన్ పానిపట్ లో నివాసం ఉండగా ,కిషన్ మాత్రం ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు.

పార్కుకు వెళ్లిన యువకులు

పార్కుకు వెళ్లిన యువకులు

కాగా వారు ముగ్గురు తమ బంధువైప దినేష్ అనే యువకుడితో కలిసి పార్క్ కు వెళ్లారు . ఈనేపథ్యంలోనే పక్కనే ఉన్నా రైల్వే ట్రాక్ వద్దకు సెల్ఫీలు తీసుకునేందుకు వెళ్లారు. నలుగురు కలిసి సెల్పీలు తీసుకుంన్నారు. అయితే ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఎదురుగా వస్తున్న రైలును గమనించిన యువకులు పక్క ట్రాక్ పై జంప్ చేశారు. అదే టైంలో మరో ట్రైన్ కూడ వస్తున్న విషయాన్ని వారు గమనించలేదు. అక్కడిక్కడే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఢిల్లి చెందిన దినేష్ మాత్రం బతికి బయటపడ్డారు. మృతిచెందిన యువకుల శరీర భాగాలు సుమారు 20 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయని పోలీసులు తెలిపారు.

ఇండియాలోనే సెల్ఫీల మరణాలు ఎక్కువ

ఇండియాలోనే సెల్ఫీల మరణాలు ఎక్కువ

ఇక సెల్ఫీలు దిగుతూ 2011 సంవత్సరం నుండి గత సంవత్సరం వరకు సుమారు 250కి పైగా చనిపోయినట్టు ఆల్ ఇండియా ఇనిస్టీట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓ నివేదికలో పేర్కోంది. కాగా మొత్తం ప్రపంచంలోనే ఇండియాతోపాటు వరుసగా రష్యా, యూఎస్, పాకిస్థాన్ లో సెల్ఫిల ప్రమాదాలు జరిగాయని నివేదిక పేర్కోంది. ఈనేపథ్యంలో రైల్వే మంత్రి పియుష్ గోయల్ సైతం తమ ఫోటోగ్రాఫ్ ల కోసం అమూల్యమైన జీవీతాలను పోగోట్టుకోవద్దని ట్విట్టర్ ద్వార హెచ్చరించారు. మరోవైపు 2017 లో సంవత్సరంలో కూడ దక్షిణ కార్ణాటక ప్రాంతంలో సైతం ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై సెల్ఫీలు దిగుతు మృత్యువాత పడ్డారు. ఒరిస్సాలో అయితే ఓ ఎనుగుతో ఫోటో తీసుకుంటున్న సమయంలో యువకుడు మృత్యువాత పడ్డ సంఘటన నెలకొంది.

English summary
Three youths killed when they were clicking selfies on a railway track, about 2-3 km from Panipat railway station in Haryana, a senior Government Railway Police (GRP) official said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X