• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ అకాంక్షను నెరవేరుస్తాం: తపస్సులా కరోనా వ్యాక్సిన్ తయారీ: మూడు టీకాలు: బ్లూప్రింట్ రెడీ: మోడీ

|

న్యూఢిల్లీ: కరోనాను నిర్మూలించడానికి వైద్యరంగ నిపుణులు అత్యంత నిష్ఠతో ఓ తపస్సులా వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి అనుమతి లభిస్తే.. అతి తక్కువ సమయంలో ప్రతి భారతీయ పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందుతుందని అన్నారు. చిట్టచివరి వ్యక్తి వరకూ కరోనా వ్యాక్సిన్‌ను చేరవేయడానికి అవసరమైన బ్లూప్రింట్ సైతం సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని, వారి అకాంక్ష త్వరలోనే ఫలిస్తాయని ప్రధాని భరోసా ఇచ్చారు.

మోడీ.. ఏడోసారి: కరోనాను జయించి తీరుతాం: రెండేళ్ల సంకల్పం: వారికి వందనాలుమోడీ.. ఏడోసారి: కరోనాను జయించి తీరుతాం: రెండేళ్ల సంకల్పం: వారికి వందనాలు

 కీలక అంశాలపై ప్రకటన..

కీలక అంశాలపై ప్రకటన..


దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ఉదయం రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళిని అర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రిగా మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది ఏడోసారి. అనంతరం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు.

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్..

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్..

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్.. ఓ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఓ వ్యక్తికి సంబంధించిన అనారోగ్య సమాచారం మొత్తాన్నీ డిజిటలీకరిస్తామని అన్నారు. దీనివల్ల డాక్టర్ల అపాయింట్‌మెంట్ మొదలుకుని అన్ని వసతులు సమకూరడంలో వేగవంతం అవుతాయని అన్నారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన దేశీయ ఆరోగ్యరంగంలో ఓ విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. జమ్మూకాశ్మీర్, లఢక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చామని, అభివృద్ధిలో సరికొత్త శిఖరాలను అందుకుంటుందని అన్నారు.

పీపీఈలను ఎగుమతులను చేస్తున్నాం..

పీపీఈలను ఎగుమతులను చేస్తున్నాం..

ఆత్మనిర్భర్, వోకల్ ఫర్ లోకల్.. ఈ రెండు దేశ ప్రజల మంత్రం కావాలని ప్రధాని అన్నారు. స్థానికంగా ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వోకల్ ఫర్ లోకల్‌ను మరింత ప్రోత్సహించాల్సి ఉందని, ఈ దిశగా చర్యలను తీసుకుంటామని అన్నారు. బ్యాంకుల విలీనం, నగదు బదిలీ.. వంటి విప్లవాత్మక సంస్కరణలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇప్పటిదాకా నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టామని చెప్పారు. ఎఫ్డీఐల్లో 18 శాతం పురోభివృద్ధి కనిపించిందని ప్రధాని అన్నారు.

మేకిన్ ఇండియా ఒక్కటే కాదు.. మేక్ ఫర్ వరల్డ్

మేకిన్ ఇండియా ఒక్కటే కాదు.. మేక్ ఫర్ వరల్డ్


ఇన్నిరోజులూ మేకిన్ ఇండియా నినాదంతో పని చేశామని, ఇప్పుడు దాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మేక్ ఫర్ వరల్డ్ నినాదాన్ని అందిపుచ్చుకుందామని చెప్పారు. దేశీయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా, ప్రపంచ దేశాలకు దేశీయ ఉత్పత్తులను అందిస్తామని అన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సి ఉందని, దీనిపై దృష్టి సారించామని నరేంద్ర మోడీ చెప్పారు.

  Andhra Pradesh : పంద్రాగస్టు వేడుకలు Vijayawada లోనే, చురుగ్గా ఏర్పాట్లు!! || Oneindia Telugu
  నేషనల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు..

  నేషనల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు..

  నేషనల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తామని అన్నారు. ఏడువేలకు పైగా ప్రాజెక్టులను గుర్తించామని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రకటించిన స్వర్ణభుజి ప్రాజెక్టు తరహాలోనే నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును తాము అమలు చేస్తామని ప్రకటించారు. రోడ్డు, రైలు, జల మార్గాలన్నింటినీ బలోపేతం చేయాలనేది దీన్ని ఉద్దేశమని అన్నారు.

  English summary
  Prime Minister Narendra Modi says that The big question is when will there be a vaccine for coronavirus. Three vaccines are being tested and once cleared they will produced in large numbers, says Modi. We will produce corona vaccine in large numbers once ready, said Modi.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X