అమెరికాలో ముగ్గురు తెలుగు యువకుల అదృశ్యం
హైదరాబాద్/న్యూయార్క్: అమెరికాలో ముగ్గురు తెలుగు యువకులు అదృశ్యమయ్యారు. వర్జీనియా రాష్ట్రంలోని ఫెయిర్ ఫ్యాక్స్ నగరంలో ఉండే మిత్రుడి ఇంటికి వెళ్లిన శరత్ సుదర్శనం, విఘ్నేష్ అశోకన్, మోకా మల్లికార్జున్ అనే ముగ్గురు తెలుగు యువకులు అదృశ్యమయ్యారు.
వీరు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని కాకీస్ విల్ నగరంలో వుంటున్నారు. విఘ్నేష్ మిత్రుడి ఇంటి నుంచి ఆదివారం రాత్రి ఈ ముగ్గురు మిత్రులు 1.15 నిమిషాలకు బయల్దేరారు.

వారు బయలుదేరిన సమయంలో ఇద్దరి ఫోన్లలో అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది. ఒకరి ఫోన్ సోమవారం వరకు పని చేసింది. అయితే ఆ ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసినా ఎవరూ తీయలేదు. ఈ విషయాన్ని విఘ్నేష్ బావ తెలిపారు.
దీంతో వర్జీనియా పోలీసుల వద్ద ముగ్గురు యువకుల అదృశ్యంపై కేసు నమోదు చేశారు. అయితే వారి నుండి సరైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ తెలుగు సంఘాలు వీరి ఆచూకీ చెప్పాల్సింతిగా తమ సభ్యులకు సమాచారాన్ని చేరవేశాయి.












Click it and Unblock the Notifications