వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో బీజేపీతో సంబంధాలు: ఆరోపణలను ఖండించిన ఫేస్‌బుక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాము ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు నెరపడం లేదని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఫేస్‌బుక్.. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తోందని పనిచేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం, ఇంటర్నేషనల్ డైలీ వరల్డ్ స్ట్రీట్ జర్నల్‌లో ఈ మేరకు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.

తమకు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, రాజకీయ వ్యవహారాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి. ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ ఆరోపణలకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు.

 ties with BJP in India allegations: Facebook denies

భారత్‌లో ఫేస్‌బుక్ మరియు వాట్సాప్‌లాంటి సోషల్ మీడియాను బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ గుప్పిట్లో ఉంచుకుని నడుపుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా దేశంలో దుష్ప్రచారాలతో పాటు విద్వేషాలను రెచ్చగొడుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అయితే చివరకు అమెరికా మీడియా ఫేస్‌బుక్ నిజనిజాలను బయటపెట్టిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ ఆరోపణలకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ అనలిటికా మరియు ఫేస్‌బుక్‌లతో గోప్యంగా ఉంచాల్సిన డేటాను ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది కాంగ్రెస్ అని ఆ విషయం గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరని రవిశంకర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు.

చేయాల్సిందంతా కాంగ్రెస్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు బీజేపీకి ఆ పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. సొంతపార్టీ పైనే నియంత్రణ లేనివారు... మొత్తం ప్రపంచాన్నే బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు కంట్రోల్ చేస్తున్నాయనే నిందలు వేయడం సహజమే అని కౌంటర్ ఇచ్చారు రవిశంకర్ ప్రసాద్. ఇక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందిస్తూ.. మీకేమైనా సందేహాలుంటూ ఫిర్యాదు చేయాలని రాహుల్ కు సూచించారు.

English summary
We prohibit hate speech... and enforce policies globally regardless of anyone’s political position -- a Facebook spokesperson said while responding to the allegations that the social media company gave leeway to hate speeches by politicians aligned with the ruling Bharatiya Janata Party (BJP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X