వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mukesh Ambani ఇంటి వద్ద అర్ధరాత్రే కారు పార్క్: సీసీటీవీ ఫుటేజీ ఇదే: భారీ పేలుడుకు కుట్ర

|
Google Oneindia TeluguNews

ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం.. ఆంటిలియా వద్ద చోటు చేసుకున్న సంఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నారు. దీనికోసం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు సైతం దర్యాప్తులో భాగస్వామ్యమయ్యారు. ఆంటిలియా వద్ద పార్క్ చేసి ఉంచిన ఆకుపచ్చ రంగు స్కార్పియో కారులో లభించిన జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి లభించాయనే విషయంపై ఆరా తీస్తోన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆంటిలియా వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

కారులో లభించిన కొన్ని అనుమానాస్పద వస్తువులు, లేబుళ్లు లభించాయని తెలుస్తోంది. వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంట సమయంలో ఆ కారు సంఘటనా స్థలంలో పార్క్ చేసి ఉంచినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. స్కార్పియోను పార్క్ చేసి ఉంచిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఓ షాప్ నుంచి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో ఫుటేజీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

tight security at Mukesh Ambani residence, Antilia in Mumbai, Police Begins Probe

వాటిని ముంబై పోలీసులు అధికారికంగా ఇంకా విడుదల చేయాల్సి ఉంది. జిలెటిన్ స్టిక్స్‌ నింపి ఉన్న స్కార్పియోను మరో తెల్లరంగు కారు అనుసరించడం, కొంతసేపటి తరువాత ఆ కారు ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. స్కార్పియో వచ్చి ఆగిన చాలాసేపటి వరకు డ్రైవర్ అందులోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సీసీటీవీ ఫుటేజీలను ముంబై పోలీసుల నుంచి యాంటీ టెర్రరిస్ట స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని క్షున్నంగా పరిశీలిస్తోన్నారు.

కారులో లభించిన జిలెటిన్ స్టిక్స్ అసెంబుల్డ్ కాదని తేలినట్టు సమాచారం. అసెంబుల్డ్ కాకపోవడం వల్ల అవి పేలే అవకాశం లేదని వారు అంచనా వేస్తోన్నారు. భయాందోళనలకు గురి చేయడానికే ఉద్దేశపూరకంగానే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఓ ప్రకటన చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ముమ్మరం చేసిందని తెలిపారు.

English summary
An abandoned vehicle with explosive material was found near business tycoon Mukesh Ambani's house in Mumbai on Thursday, Maharashtra Home Minister Anil Deshmukh said, in a bomb scare just metres away from where India's richest man lives under high security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X