వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ జూలో ఆడ పులి మృతి: కరోనా అనుమానం, పరీక్షలకు నమూనాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జూలో బుధవారం ఓ ఆడ పులి కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందింది. అయితే, దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పులికి సంబంధించిన నమూనాలను కరోనా పరీక్షల కోసం పంపారు.

బుధవారం సాయంత్రం కల్పన అనే ఈ ఆడపులి మరణించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల నేపథ్యంలో గురువారం ఈ పులి అంత్యక్రియలను నిర్వహించారు. జంతువుల నుంచి కూడా మనషులకు కరోనా సోకే అవకాశం ఉండటంతో పులి నమూనాలను కరోనా పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు.

Tigress dies of kidney failure in Delhi zoo, sample sent for covid 19 testing

కాగా, పులి పోస్టుమార్టం రిపోర్టులో అధిక క్రియేటినిన్ ఉందని తేలింది. పులి అంత్యక్రియలు కొంత మంది అధికారులు మాత్రమే పాల్గొన్నారు. పులికి సంబంధించిన నమూనాలను ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్(బరేలీ)కి పంపించారు.

Recommended Video

Hungry Bear Roams California Streets

సెక్రటరీ ఆఫ్ సెంట్రల్ జూ అథారిటీ మాజీ మెంబర్ డీఎన్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ జూ అధికారుల నిర్లక్ష్యం వల్లే పులి మరణించిందని ఆరోపించారు. డీహైడ్రేషన్ కారణంగానే పులి చనిపోయిందని అన్నారు. రెక్టమ్ ద్వారా సెలైన్ పెట్టించాలని సీనియర్ వెటర్నరీ అధికారి చెప్పినప్పటికీ జూ అధికారులు వినిపించుకోలేదన్నారు. పులి అంత్యక్రియల్లో కూడా సీనియర్ అధికారులు ఎవరూ వెల్లడించలేదని తెలిపారు.

English summary
A tigress died in Delhi Zoo on Wednesday due to "kidney failure" and authorities have sent her samples for coronavirus testing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X