• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తీహార్ జైలుకు దినకరన్: బ్యాంకు అకౌంట్లు సీజ్, ఇసుక క్వారీలు, హవాలా సోమ్ము !

|

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటూ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని నానా హంగామా చేసిన టీటీవీ దినకరన్ ను తీహార్ జైలుకు తరలించారు. టీటీవీ దినకరన్ ను 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూనమ్ చౌధరీ ఆదేశాలు జారీ చేశారు.

డ్రామాలు ఆడితే చర్చలు రద్దు: పన్నీర్ సీరియస్: డెడ్ లైన్, తేల్చకుంటే !

ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ టీటీవీ దినకరన్ ను తీహార్ కేంద్ర కారాగారానికి తరలించారు. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన దినకరన్ ఆ నగదు ఏలా సమకూర్చారు అని పూర్తి వివరాలు సేకరించారు. ఇసుక క్వారీల కాంట్రాక్టులు ఇచ్చి అందుకు ప్రతిఫలంగా టీటీవీ దినకరన్ భారీ మొత్తంలో నగదు సమకూర్చారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.

మంత్రులు, అధికారులకూ ఆందోళన తప్పలేదు

మంత్రులు, అధికారులకూ ఆందోళన తప్పలేదు

తమ కస్టడీలో ఉన్న టీటీవీ దినకరన్ ను చెన్నై తీసుకు వచ్చిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. టీటీవీ దినకరన్ కు సహకరించిన కొందరు మంత్రులు, సీనియర్ అధికారులు మమ్మల్ని ఎక్కడ అరెస్టు చేస్తారో ? అని ఆందోళన చెందారని వెలుగు చూసింది.

సమన్లు జారీ చేసి వెళ్లిపోయారు

సమన్లు జారీ చేసి వెళ్లిపోయారు

దినకరన్ కు నగదు సమకూర్చే విషయంలో మంత్రులు, అధికారుల హస్తం ఉందని, ఆ జాబితా ఢిల్లీ పోలీసుల దగ్గర ఉందని వెలుగు చూసింది. ఢిల్లీ పోలీసులు ఐదు మందికి సమన్లు జారీ చేసి విచారణ ముగించుకుని ఢిల్లీ వెళ్లిపోయారు.

ఢిల్లీ పోలీసులు మరింత దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది.

మంత్రులు, అధికారులకు సమన్లు

మంత్రులు, అధికారులకు సమన్లు

తమిళనాడులోని పలువురు మంత్రులు, అధికారులకు సమన్లు జారీ చెయ్యడానికి ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారని తెలిసింది. అందుకు అద్దం పట్టే విధంగా ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ వివరాల్ని సమర్పించారని తెలిసింది.

ఇసుక క్వారీలు కాంట్రాక్టు, అడ్వాన్స్ గా రూ. 10 కోట్లు

ఇసుక క్వారీలు కాంట్రాక్టు, అడ్వాన్స్ గా రూ. 10 కోట్లు

ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి టీటీవీ దినకరన్ ఇసుక క్వారీల కాంట్రాక్టుల ద్వారా రూ. 50 కోట్లు సమీకరించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇటీవల ఈరోడ్ కు చెందిన ఓ వ్యాపారికి ఇసుక క్వారీ కట్టబెట్టారని, అందుకు ప్రతిఫలంగా రూ. 10 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారని పోలీసుల విచారణలో బయటపడింది.

దినకరన్ ఐదు బ్యాంక్ అకౌంట్లు సీజ్

దినకరన్ ఐదు బ్యాంక్ అకౌంట్లు సీజ్

టీటీవీ దినకరన్ కు చెందిన ఐదు బ్యాంకు అకౌంట్లను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీల ద్వారానే దినకరన్ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి నిధులు సమకూర్చారని వెలుగు చూసింది. ఈ దెబ్బతోనే ఇసుక క్వారీలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రచారం ఊపందుకుంది.

తీహార్ జైల్లో టీటీవీ దినకరన్ బ్యారెక్ ఇదే

తీహార్ జైల్లో టీటీవీ దినకరన్ బ్యారెక్ ఇదే

ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో టీటీవీ దినకరన్, ఆయన సన్నిహితుడు మల్లికార్జున్ కు వైద్యపరీక్షలు నిర్వహించి తీహార్ జైల్లోని రోహిణి బ్యారెక్ కు తరలించారు. వీరితో పాటు దినకరన్ హవాల సోమ్ము తరలించారని అరెస్టు అయిన నతు సింగ్ ను తీహార్ జైలుకు తరలించారు. దినకరన్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అవసరం అయితే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దినకరన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని ప్రత్యేక కోర్టు ఢిల్లీ పోలీసులకు సూచించింది.

ఇద్దరు మంత్రులు, శేఖర్ రెడ్డి

ఇద్దరు మంత్రులు, శేఖర్ రెడ్డి

తమిళనాడుకు చెందిన ఇద్దరు మంత్రులు ఇసుక క్వారీలు నడుపుతున్నారు. టీటీవీ దినకరన్ కేసులో ఢిల్లీ పోలీసులు ఇద్దరు మంత్రులతో పాటు ఇప్పటికే అరెస్టు అయిన ఇసుక క్వారీల కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Special Judge Poonam Chaudhry sent Dhinakaran and his aide Mallikarjuna to Tihar Jail till May 15 after the police said that the accused were not needed for custodial interrogation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more