• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుప్రీం ఆదేశాల మేరకు గూగుల్ లో టిక్ టాక్ బ్లాక్ .. ఇంకా స్పందించని ఆపిల్

|

ఇండియాలో చాలా పాపులర్ యాప్ గా క్రేజ్ ఉన్న టిక్ టాక్ యాప్ యాక్సెస్ ను బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. పూర్తిగా పాలీ స్టోర్ నుండి తొలగించింది . టిక్ టాక్ యాప్ డౌన్ లోడ్లను నిషేధించామని, మద్రాస్ హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ సుప్రీం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ పేర్కొంది.

టిక్ టాక్ యాప్ బ్యాన్ పై బైటెండెన్స్ రివ్యూ పిటిషన్.. సుప్రీంలో చుక్కెదురు

టిక్ టాక్ యాప్ బ్యాన్ పై బైటెండెన్స్ రివ్యూ పిటిషన్.. సుప్రీంలో చుక్కెదురు

టిక్ టాక్ యాప్ పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని, చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని పెద్దఎత్హున ఆరోపణలు పెల్లుబికాయి .. ఇక ఈ యాప్ ను దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు యాప్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. టిక్ టాక్ ను అందిస్తున్న చైనా సంస్థ బైటెండెన్స్ టెక్నాలజీ రివ్యూ పిటిషన్ వేసింది. ఈ నెల 3వ తేదీన టిక్ టాక్ ను నిషేధించాలన్న ఉత్తర్వులు వెలువడగా, భారత్ వంటి పెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేని బైటెండెన్స్, తన వంతు ప్రయత్నాలు చేసి విఫలమైంది.

గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ తొలగింపు .. ఇక నో టిక్ టాక్ యాక్సెస్

గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ తొలగింపు .. ఇక నో టిక్ టాక్ యాక్సెస్

సుప్రీంకోర్టును సంస్థ ప్రతినిధులు ఆశ్రయించగా, కేసును మద్రాస్ హైకోర్టుకే బదిలీ చేస్తూ అత్యున్నత ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. యాప్ ను నిషేధించడం ఇండియాలో వాక్ స్వాతంత్రానికి విఘాతమని బైటెండెన్స్ చేసిన వాదనతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. గూగుల్ నుండి, యాపిల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును 22న వెల్లడించనుంది. అయితే గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ను తొలగించామని గూగుల్ ప్రకటించింది ,

యాప్ తొలగింపుపై ఇంకా స్పందించని యాపిల్

యాప్ తొలగింపుపై ఇంకా స్పందించని యాపిల్

యాపిల్ మాత్రం ఇంకా స్పందించలేదు. జనవరి నాటికి ఈ యాప్ 24 కోట్ల స్మార్ట్ ఫోన్లలో ఇన్ స్టాల్ అయింది. కాగా కొద్ది రోజుల ముందే టిక్ టాక్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో 6 మిలియన్ వీడియోలను తొలగించింది టిక్ టాక్. ఇందులో ఖాతాదార్లుగా 88.6 మిలియన్ యూజర్లు ఉన్నారట. . ఇప్పటికే యూఎస్, యూకే, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో ఈ యాప్‌లపై పూర్తిగా నిషేధం ఉంది . ఇక ఇండియాలో కూడా ఈ యాప్ నిషేదం కొనసాగనుంది . ఈ నెల 22న వెల్లడించే తీర్పును బట్టి ఈ యాప్ పరిస్థితి ఇండియాలో ఏ విధంగా ఉండబోతుందో తేలనుంది .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Google and Apple Inc. complied with an Indian court order to block downloads of the popular app TikTok over government concerns with illicit content, according to people familiar with the decision. The move could handicap the app's owner, China's Bytedance Ltd., Representatives for Google and Apple declined to comment. The court ruling restricts future downloads of the app in India, not existing users, Finally google blocked the downloads and removed tik tok from the play store . apple is not responded on this yet .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more