వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతికొచ్చిన పంట త్యాగానికైనా సిద్ధం కండి, త్వరలో హల్ క్రాంతి : రైతులకు రాకేశ్ టికాయత్ పిలుపు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేవరకు రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ తేల్చి చెప్పారు. రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను కొనసాగించడానికి ఒక పంటను త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని రాకేశ్ టికాయత్ అన్నారు.

దేశ వ్యాప్తంగా రైల్ రోకో .. హర్యానా, పంజాబ్ ,యూపీలలో రైల్వే ట్రాక్ లపై పడుకుని రైతుల నిరసన దేశ వ్యాప్తంగా రైల్ రోకో .. హర్యానా, పంజాబ్ ,యూపీలలో రైల్వే ట్రాక్ లపై పడుకుని రైతుల నిరసన

పంటలు కోయడానికి రైతులు వెళ్ళిపోతారు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదు

పంటలు కోయడానికి రైతులు వెళ్ళిపోతారు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదు

పంటలు కోయడానికి రైతులు తమ ఇళ్ళకు వెళ్ళిపోతారు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉండకూడదని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కోసం అవసరం అయితే పంటలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.

ఒకవైపు పంటలు సాగు చేయడంతో పాటుగా, మరోవైపు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పిన భారత కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ అవసరం అనుకుంటే పంటను తగలబెట్టడానికైనా సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు.

 హర్యానాలో మహా పంచాయతీలో రాకేశ్ టికాయత్ పిలుపు .. హల్ క్రాంతికి సిద్ధం కండి

హర్యానాలో మహా పంచాయతీలో రాకేశ్ టికాయత్ పిలుపు .. హల్ క్రాంతికి సిద్ధం కండి

హర్యానాలోని హిసార్ లోని ఖరక్ పూనియా గ్రామంలో కిసాన్ మహాపాంచాయతీలో ప్రసంగించారు. నిరసనకు నాయకత్వం వహిస్తున్న యూనియన్ల తదుపరి పిలుపుకు సిద్ధంగా ఉండాలని టికాయత్ రైతులను కోరారు. మీ ట్రాక్టర్లను ఇంధనంతో నింపి ఢిల్లీ రావటానికి సిద్ధం కావాలన్నారు . ఎప్పుడైనా మీకు పిలుపునివ్వవచ్చు, అది కమిటీ (రైతు సంఘాలు) నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. ఈ సారి హల్ క్రాంతి ఉంటుందని , దీనిలో రైతులు వ్యవసాయ క్షేత్రాలలో ఉపయోగించే పరికరాలతో ప్రదర్శన నిర్వహిస్తారని ఆయన చెప్పారు .

నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఇంటికి వెళ్ళేది లేదన్న రాకేశ్ టికాయత్

నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఇంటికి వెళ్ళేది లేదన్న రాకేశ్ టికాయత్

హర్యానాలో మహాపంచాయత్ తర్వాత దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కిసాన్ మహా పంచాయత్ నిర్వహిస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో మహా పంచాయతీలు నిర్వహిస్తారని రాకేశ్ టికాయత్ చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఘర్ వాపసీ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఉద్యమం ఉధృతం చెయ్యటంలో భాగంగా రైతులు దేశ వ్యాప్తంగా మహా పంచాయతీలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు .

English summary
Asserting that farmers are not going to return home till the farm laws are repealed, Bharatiya Kisan Union leader Rakesh Tikait Thursday said the farming community should be ready to sacrifice one crop to continue the agitation.“The government is saying the farmers will return to villages for harvesting of (wheat) crop. If needed, you should be ready to sacrifice one crop…prepare to set your standing crop on fire,” Tikait said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X