• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిక్‌టాక్... వాట్స్ నెక్స్ట్... ప్రభుత్వాన్ని సవాల్ చేస్తుందా... ఉద్యోగుల సంగతేంటి..?

|

టిక్‌టాక్‌ నిషేధంపై ఆ సంస్థ భారత ప్రభుత్వాన్ని న్యాయపరంగా సవాల్ చేయనుందా..? లేక ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ... డేటా ప్రొటెక్షన్‌,సెక్యూరిటీ లోపాలను సవరించుకుంటుందా..? తాజాగా ఈ అంశంపై టిక్‌టాక్ ప్రతినిధి మాట్లాడుతూ... భారత ప్రభుత్వాన్ని న్యాయపరంగా సవాల్ చేసే ఆలోచన తమకు లేదన్నారు. ప్రస్తుతానికి తమ ఫోకస్ యూజర్స్ డేటా ప్రొటెక్షన్ & సెక్యూరిటీ పైనే ఉందన్నారు. టిక్‌టాక్ సీఈవో కెవిన్ మేయర్ కూడా బుధవారం(జూలై 1) ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

టిక్‌టాక్ సంస్థ ఏమంటోంది...

టిక్‌టాక్ సంస్థ ఏమంటోంది...

'టిక్‌టాక్ భారత ప్రభుత్వాన్ని న్యాయపరంగా సవాల్ చేయనుందని మీడియా కథనాలు వస్తున్నాయి. అయితే మాకు అలాంటి ఆలోచన లేదు. ప్రభుత్వం లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడంపై మేము ఫోకస్ చేశాం. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తాం. మా యూజర్స్ డేటా పట్ల భద్రత,గోప్యత,సార్వభౌమాధికారానికి భరోసా ఇవ్వడమే మా టాప్ ప్రియారిటీ.' అని టిక్‌టాక్ పేర్కొంది.

ఆ ఉద్యోగుల సంగతేంటి...

ఆ ఉద్యోగుల సంగతేంటి...

భారత ప్రభుత్వం నిషేధం విధించిన చైనీస్ యాప్స్‌లో బైట్ డ్యాన్స్‌కి చెందిన టిక్‌టాక్,హలో యాప్స్ ఉన్నాయి. ఈ రెండింటికి భారత్‌లో భారీ సంఖ్యలో యూజర్స్ ఉన్నారు. టిక్‌టాక్‌కి సగటున ఒక నెల 120 మిలియన్ల మంది యూజర్స్ ఉండగా... హలో యాప్‌కి దాదాపు 50 మిలియన్ల యూజర్స్ ఉన్నారు. తాజాగా వీటి సేవలు నిలిచిపోవడంతో... ఇందులో పనిచేస్తున్న 2వేల మంది భారతీయ ఉద్యోగుల సంగతేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. టెక్నాలజీ,కంటెంట్ స్ట్రాటజీ,కమ్యూనికేషన్స్ విభాగంలో వీరు పనిచేస్తున్నారు.

ఆ తర్వాతే క్లారిటీ...

ఆ తర్వాతే క్లారిటీ...

టిక్‌టాక్,హలో యాప్స్‌ని నిషేధించినా.. ఆ సంస్థకు చెందిన భారతీయ ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతుండటం గమనార్హం. 'ఆ ప్లాట్‌ఫామ్స్ మేనెజ్‌మెంట్‌ను డేటా సెక్యూరిటీపై ప్రభుత్వం వివరణ కోరింది. కాబట్టి మధ్యే మార్గానికి అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే భారతీయ ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉన్నట్లు కనిపించట్లేదు.' అని ఢిల్లీకి చెందిన ఓ రిక్రూటింగ్ కన్సల్టెంట్ సంస్థ అబిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వంతో చర్చల తర్వాతే... ఈ భారత్‌లో ఈ సంస్థల భవిష్యత్,అలాగే ఉద్యోగుల భవిష్యత్ ఏంటన్నది తేలుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  చైనా జలాంతర్గాములను Track చేయడానికి Andaman Port ను ఆ దేశ నావికాదళాల కోసం తెరవాలి- Chinoy
  నిషేధం శాశ్వతమా...?

  నిషేధం శాశ్వతమా...?

  భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌పై నిషేధం విధించిన మరుసటిరోజు నుంచి ఆ యాప్స్ సేవలు నిలిచిపోయాయి. భారత్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా ఆ యాప్స్ తొలగించబడ్డాయి. నిజానికి భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏప్రిల్,2019లో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు టిక్‌టాక్‌‌పై నిషేధం పడింది. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే నిషేధం ఎత్తివేయబడింది. తాజాగా భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం శాశ్వతంగా అమలవుతుందా... లేక తాత్కాలికమేనా అన్నది మున్ముందు తెలియనుంది.

  English summary
  TikTok has refuted reports that suggested that the company was looking to contest the ban on 59 Chinese apps as imposed by the government of India. Instead, a company spokesperson has confirmed that TikTok now aims to work with government suggestions and directives, with regards to data protection and security. This falls in line with yesterday’s statement by TikTok CEO Kevin Mayer, who claimed that TikTok is compliant with all rules and regulations put forth by the Indian government.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X